
తెలుగులో కొన్ని సీజన్లు మాత్రమే ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి.. అయితే బిగ్ బాస్ హోస్టుగా మూడో సీజన్ నుంచి నాగార్జున నిర్వహిస్తూ ఎనిమిదవ సీజన్ ఉన్నారు. ఫస్ట్ రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని హోస్టుగా చేశారు. త్వరలోనే బిగ్ బాస్ -9 సీజన్ మొదలు కాబోతోంది.దీంతో ఇప్పటినుంచి బిగ్ బాస్ కు సంబంధించి ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అయితే హోస్టుగా కూడా చాలామంది నాగార్జున విమర్శలు చేసినప్పటికీ కూడా ఏ విధంగా వాటిని పట్టించుకోలేదు.
ప్రతి సీజన్ కి కూడా నాగార్జున కొత్తదనాన్ని చూపిస్తూ మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. చాలామంది నాగార్జున ఇంటి ముందుకు వెళ్లి బిగ్బాస్ ని ఆపాలి అంటూ చాలామంది బంద్ కూడా చేశారు. అయితే వచ్చే సీజన్లో భారీ స్థాయిలో మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా నాగార్జున హోస్టు నుంచి తప్పించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో ఏమో కానీ కొత్తగా హోస్ట్ గా ఇద్దరి పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ పేరు వినిపిస్తూ ఉన్నది.. ఇక మరొక స్టార్ హీరో పేరు విజయ్ దేవరకొండ.. మరి వీరిద్దరిలో ఎవరో ఒకరు హోస్ట్ గా చేస్తారా లేకపోతే నాగర్జున చేస్తారా అన్నది చూడాలి మరి.