
రాగా మాధురి మాట్లాడుతూ .. తాను మొదట ఆట కావాలా పాట కావాలా వంటి షోలకు యాంకర్ గా చేశానని ఆ తర్వాతే సీరియల్స్ వైపుగా వెళ్లానని.. అలా ఒక సీరియల్ ఒప్పుకున్న సమయంలో సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయని వెల్లడించింది.. అలా ఒకసారి మీరు అచ్చం తెలుగమ్మాయిలా ఉన్నారు ఆడిషన్స్ అవసరం లేదు అంటూ ఒక వ్యక్తి తన దగ్గరికి అవకాశం ఉన్నది నటిస్తారా అని అడిగారని..కానీ చివరిలో కమిట్మెంట్ అనేది ఒకటి ఉంటుందని చెప్పారని అయితే అప్పటికి ఆ విషయం తనకు తెలియదని తెలియజేసింది రాగా మాధురి.
అయితే మనం కమిట్మెంట్ అంటే కేవలం వర్క్ పరంగానే అనుకున్నాము.. ఆ సమయంలో ఆ వ్యక్తితో తన బ్యాక్ గ్రౌండ్ ఒకసారి చూడొచ్చు అంటూ తెలియజేసిందట.. అయితే అప్పటికే రాగా మాదిరి 8 ప్రోగ్రామ్స్ వరకు చేసి, అవార్డులు కూడా అందుకున్నదట.. కాని చివరికి ఆ వ్యక్తి కమిట్మెంట్ అంటే మీరు అనుకున్నది కాదు.. ఇండస్ట్రీలో వేరే ఉంటుంది అంటూ చెప్పారట.. చివరికి అతను కాంప్రమైజ్ కావలసి వస్తుందని చెప్పారని.. అయితే అతడు చెప్పిన మాటలు విని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారని.. దాంతో వెంటనే ఆ సమయంలోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యానని తెలిపింది. ఇదే కాకుండా తన పర్సనల్ జీవితంలో కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపింది రాగా మాధురి.