
అనసూయకు రంగస్థలం సినిమాతో పెద్ద బ్రేక్ పడింది. ఆ తర్వాత పుష్ప, పుష్ప 2 వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. అయితే అనసూయ కెరియర్ లో అత్యధికంగా హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న సినిమా ఇదే అంటే ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. అనసూయ టాలీవుడ్ లో తన కాల్ షీట్లు రోజుకి చొప్పున ఇస్తోందట. దీని ప్రకారం పుష్ప 2 చిత్రానికి అనసూయ అత్యధికంగా 1.5 నుంచి 2 లక్షల రూపాయల వరకు రోజుకి ఛార్జ్ చేసిందట.
అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ రెమ్యూనరేషన్తో సినిమా ఆఫర్లు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పెదకాపు అనే చిత్రంతో హీరోగా మారిన విరాట్ కర్ణ తన తదుపరి చిత్రమైన నాగబంధం అనే సినిమాలో అనసూయ కీలకమైన పాత్రలో నటిస్తోందట. ఇందుకోసం అనసూయ రోజుకి 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు అందుకుంటున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. అయితే ఈ పాత్రకు అనసూయని సెట్ అవుతుందని నిర్మాతలు భావించడంతో అనసూయని ఏరి కోరి మరి ఎంచుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారుతోంది. ఇప్పటికే హరిహర వీరమల్లు అంటే పాన్ ఇండియా చిత్రంలో కూడా కనిపించబోతోంది అనసూయ. మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటిస్తుందేమో చూడాలి.