సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం ఇప్పుడు చాలా కామన్ గా మారిపోతున్నది.. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఎన్నో ఏళ్లు బంధానికి కూడా మధ్యలో ముగించేస్తూ ఉన్నారు. ఇటీవలే ఏఆర్ రెహమాన్ తన 27 ఏళ్ల బంధానికి ( భార్య కు) స్వస్తి పలకడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మరొక బాలీవుడ్ జంట కూడా విడాకులకు సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరి వివాహమై ఏడేళ్లు అవుతూ ఉన్న విడిపోతున్నారని టాక్ ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నది. ఇక ఆమె ఎవరో కాదు బుల్లితెర నటి దీపికా కరర్.


ఈమె రెండో భర్తతో కూడా విడాకులు తీసుకున్నట్లు గత కొద్ది రోజుల నుంచి పలు రకాల రూమర్స్ వినిపిస్తున్న సమయంలో తమపై వస్తున్న వార్తలకు ఈ బుల్లితెర జంట క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా కేవలం రూమర్స్ అంటూ అవి చూస్తూ ఉంటే నవ్వొస్తోందని తెలియజేస్తోంది దీపికా.. తాజా ఇంటర్వ్యూకు హాజరైన ఈమె తన భర్త షోయబ్ విడాకుల పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. 2018లో వీరి వివాహం అయ్యిందని తెలియజేశారు.


వీరికి ఒక కుమారుడు కూడా జన్మించారు. దీంతో దీపికా, షోయబ్ బాలీవుడ్ సీరియల్స్ లో ససురల్ సీమర్ కా సీరియల్ సెట్లు వీరిద్దరూ కలుసుకోవడం జరిగిందట ఆ తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారి 2018లో ఒకటయ్యారట. అంతకుముందు దీపిక పైలెట్ రౌనక్ ను పెళ్లి చేసుకున్నప్పటికి... వివాహమైన నాలుగేళ్లకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారట. ఆ తరువాతే నటుడు షోయోబ్ ని పెళ్లి చేసుకొని  2023లో కుమారుడు రోహాన్ కి జన్మనిచ్చారు. మొత్తానికి విడాకుల రూమర్స్ పై క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సైతం కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్య తరచూ సెలబ్రిటీలకు సంబంధించి బ్రేకప్ విషయాలు, విడాకుల వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: