
అలా పలు భాషలలో కూడా ఈమె నటించే అవకాశం అందుకున్న అశ్వని ఈటీవీలో ఎక్కువగా కొన్ని రకాల సీరియల్స్ నటించే అవకాశాలు అందుకున్నదట. సెంటిమెంట్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అశ్వని.. తెలుగులో చిరంజీవి నటించిన హిట్లర్ చిత్రంలో కూడా ఆయన చెల్లెలుగా నటించిందట. అలా తెలుగులో సీరియల్స్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించి పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. ఇక వివాహం అయిన తర్వాత 2007లో ఓరం పో అనే చిత్రంలో కూడా నటించిందట.
ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఏ చిత్రాలలో కూడా నటించలేదు.. ఇటి వలె అమెజాన్ ప్రైమ్ లో సుజన్ వెబ్ సిరీస్లో విభిన్నమైన పాత్రలలో నటించిందట అశ్వని.. అయితే ఒక షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలియజేసింది. తన పైన లైంగిక వేధింపులు జరిగిందని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఒకసారి తన అమ్మ లేకుండా సినిమా షూటింగ్స్ స్పాట్ కి వెళ్ళినప్పుడు డైరెక్టర్ తనని పైన ఉన్న రూముకి పిలిచారని.. అప్పుడు తనకి ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలిసేది కానీ..సాధారణంగా వెళ్లానని తెలిపింది.. అయితే లోపలికి వెళ్లిన తర్వాత డైరెక్టర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని.. ఆ డైరెక్టర్ తనతో అలా చేస్తారని అసలు అనుకోలేకపోయానని తెలిపింది.. ఆ వెంటనే కిందికి దిగి ఇంటికి పారిపోయారని తెలిపింది. కానీ ఆ డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు.