
ఇందుకు సంబంధించి మేకర్స్ కంటెస్టెంట్లను ఎంపిక చేసే పనిలో పడ్డారట. ముఖ్యంగా నాగార్జున కూడా హోస్ట్ గా నుంచి తప్పుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఎంతో మంది ఈ షోని ఆపివేయాలని కూడా నాగార్జున ఇంటి ముందు ధర్నాలు కూడా చేశారు. కేసులు కూడా వేయడం జరిగింది. అందుకే నాగార్జున కూడా బిగ్ బాస్ 9 వ సీజన్ కి దూరం అవ్వడానికే సిద్ధమయ్యారట.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.. కానీ 9వ సీజన్ కి మాత్రం టాలీవుడ్ యంగ్ హీరో రౌడీ హీరోగా పేరుపొందిన విజయ్ దేవరకొండ హోస్ట్గా వ్యవహరించబోతున్నట్లు జోరుగా ప్రచారం అయితే వినిపిస్తోంది.
మరి నిజం ఏంటన్నది తెలియాల్సి ఉంది.. నాగార్జున తప్పుకుంటే నెక్స్ట్ ఎవరన్నది ఇప్పుడు సందేహంగా మారింది.. నాగార్జున 3వ సీజన్ నుంచి గత ఏడాది జరిగిన 8వ సీజన్ వరకు హోస్టుగా వ్యవహరించారు.. హోస్టుగా నాగార్జున బాగానే సక్సెస్ అయిన ఎక్కువగా విమర్శలు వినిపిస్తూ ఉండడంతో నాగార్జున తప్పుకోబోతున్నారట.అంతేకాకుండా నాగార్జున సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతూ ఉండడంతో కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ప్లాన్ చేస్తున్నారట. అలాగే తన కుమారులు నాగచైతన్య, అఖిల్ సినీ కెరియర్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని నిర్ణయాలను కూడా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏంటన్నది చూడాలి.