బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ కి మొత్తం సిద్ధమవుతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇందులో కంటెస్టెంట్ గా ఎవరెవరు ఉంటారని విషయం సోషల్ మీడియాలో కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా హోస్ట్ గా ఈసారి నాగార్జున తప్పుకోబోతున్నారని.. అలాగే కంటేస్టేంట్లను కూడా ఈసారి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాటీవీలో ప్రసారమయ్యే కిర్రాక్ బాయ్స్, ఖిలాడి గర్ల్స్ కి సంబంధించిన కంటెస్టెంట్లను తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.


కిర్రాక్ బాయ్స్, ఖిలాడి గర్ల్స్ లో ఎవరైతే పాల్గొంటారో వారినే బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా తీసుకునేందుకు అవకాశం ఉన్నదట..గత సీజన్ 8 విన్నర్ అయిన నిఖిల్ మొదలు ఆ తర్వాత అర్జున్, టేస్టీ తేజ, శోభా శెట్టి, అమర్దీప్, ప్రేరణ, గౌతమ్ కృష్ణ వీరందరూ కూడ షో లో పార్టిసిపేషన్ చేశారట. ఆ తరువాతే వీరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.. ఇప్పుడు ఇదే సాంప్రదాయాన్ని మరొకసారి ఫిక్స్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కిర్రాక్ బాయ్స్, ఖిలాడి గర్ల్స్2 కి సంబంధించి ప్రోమో కూడా వైరల్ గా మారుతున్నది.



గేమ్ షోలో గత సీజన్ లాగానే శేఖర్ మాస్టర్, అనసూయ టీమ్ లో లీడర్ గా చేయబోతున్నారు.. శ్రీముఖి యాంకర్ గా ఫిక్స్ అయ్యింది. గతంలో అయితే కిర్రాక్ బాయ్స్ టీమ్ నుంచి పదిమంది, ఖి లాడి గర్ల్స్ టీమ్ నుంచి పదిమంది పోటీ పడుతున్నారట. అయితే ఇందులో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ బిగ్బాస్ 9 హౌస్ లోకి వెళ్లే అవకాశం ఉన్నదట.. అందులో"రవికృష్ణ, తేజస్వి మదివాడ, రోహిణి, శ్రీ సత్య, పృధ్విరాజ్ శెట్టి,  హమీద వంటి వారు హౌస్ లో ఆల్రెడీ వెళ్లి వచ్చారు.. గతంలో కూడా ఆల్రెడీ వెళ్లి వచ్చిన వారిని తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మళ్ళీ కూడా వీరు వెళ్లే అవకాశం ఉన్నదట.

అలాగే వీరితోపాటు బిగ్బాస్ 9 కంటెస్టెంట్ గా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎవరెవరికి ఉన్నది అంటే.. జబర్దస్త్ ఇమ్మానుయేల్, సీరియల్ నటి అనాలా సుష్మిత, యాంకర్ నిఖిల్, జబర్దస్త్ ఐశ్వర్య, సత్యభామ సీరియల్ నటి , ప్రియాంక జైన్ లవర్ శివకుమార్ వంటి వారు వెళ్లే అవకాశం ఉన్నదట. మరి ఏంటన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: