
టెలివిజన్ రంగంలోని ఉండేటువంటి నటిమనులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయట.. డైరెక్ట్ గానే ఎటువంటి మొహమాటం లేకుండా కమిట్మెంట్లు అడిగేస్తూ ఉన్నారని చాలామంది ఇప్పటికే తెలియజేశారు. ఇటీవలే యాంకర్ అనసూయ కూడా ఈ విషయం మీద మాట్లాడింది. ఇప్పుడు తాజాగా బుల్లితెర నటి జబర్దస్త్ నటిగా పేరుపొందిన రోహిణి కూడా ఇండస్ట్రీలో కమిట్మెంట్ పైన పలు వ్యాఖ్యలు చేసింది. సినిమాలలో కూడా చాలా కీలకమైన పాత్రలలో నటిస్తోంది రోహిణి. టెలివిజన్ రంగంలో అడుగుపెడుతున్న సమయంలో కెరియర్ ప్రారంభంలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని వెల్లడించింది.
ఒక సీరియల్ కోసం తాను ఆడిషన్ కి వెళ్ళినప్పుడు తనకు ఛాన్స్ ఇస్తాను కమిట్మెంట్ ఇవ్వాలి అంటూ ఒక నిర్మాత దగ్గర ఉండే మేనేజర్ తనని అడిగారట. అయితే ఈ విషయం పైన తనకి అప్పట్లో అవగాహన లేక కమిట్మెంట్ వర్కు గానే పనిచేస్తానని వర్క్ విషయంలో ఎలా అయినా కష్టపడతానని వెల్లడించిందట.. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డానని అయితే ఈ విషయాన్ని తనకు తెలిసిన అంకుల్ వద్ద చెప్పి ఆ ప్రొడ్యూసర్ కి ఫోన్ చేయించి మరి వార్నింగ్ ఇచ్చామని తెలియజేసింది. అయితే ఈ విషయం పైన నిర్మాతకు, మేనేజర్ కి సైతం గట్టి వార్నింగ్ ఇచ్చాను అంటూ తెలిపింది.