
అయితే మళ్లీ ఇటీవలే ఇతని గురించి ఒక వివాదాస్పదమైన వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో ఆడవేషంలో ఉన్న విక్రమన్ దగ్గర్లోని ఒక అపార్ట్మెంట్లో నివసించి పురుషులపై లైంగిక వేధింపులు చేస్తున్నారంటూ పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో విక్రమన్ పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదురవుతోందట. ఈ నేపథ్యంలోనే విక్రమన్ భార్య ఈ విషయం పైన పోలీస్ స్టేషన్లోకి వెళ్లి మరి ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చిందట.
ఈమె మాట్లాడుతూ మేము ఇంతకుముందు ఉన్న అపార్ట్మెంట్లో షూటింగ్ కోసం తీసినటువంటి ఒక వీడియోని ఇప్పుడు చాలామంది దానిని తప్పుగా ప్రచారం చేస్తూ పోస్ట్ చేస్తున్నారని.. అయితే ఆ వీడియో తీసే సమయంలో తాను ఊరిలో లేను నా సినిమా కోసం ఆ వీడియో తీయమని తన భర్తకి తానే చెప్పానని అయితే ఆ వీడియో తీయడానికి వచ్చిన వాళ్ళు అతని హిజ్రా అనుకోని దాడి చేస్తూ ఉంటారు... నిజానికి వాళ్లు చేసింది తప్పు అని చూపించడానికి ఆ వీడియో చేశాము కానీ ఈ వీడియో చేసి ఇప్పటికి ఆరు మాసాలు కాబోతోంది. ఇప్పుడు వైరల్ గా చేస్తున్నారు? అందుకే ఈ వీడియో పైన పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేయడానికి వచ్చాను అంటూ తెలియజేసింది విక్రమన్ భార్య.