
ముఖ్యంగా గత ఏడాది నవంబర్లో సీక్రెట్ గా వీరు వివాహం చేసుకున్నప్పటికీ.. వివాహమైన నాలుగు నెలలు తిరగకముందే వీరు విడిపోయినారట. బాలీవుడ్లో బుల్లితెర మీద బాగానే క్రేజీ సంపాదించిన అతిధి శర్మకు సీరియల్స్ తో పాటు షోలలో కూడా బాగానే పేరు సంపాదించుకున్నది. సుమారుగా 4 ఏళ్లపాటు ఆభినీత్తుతో ఈమె సహజీవనం చేసిందట. ఈ విషయం బాలీవుడ్ అంతా కూడా పాకిపోయింది.వీరిద్దరూ సన్నిహితంగా ఉండే ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉండేవారు.. అలా కొన్నేళ్లపాటు సహజీవనం చేసిన వీరు గత ఏడాది నవంబర్లో వివాహం చేసుకోవడం జరిగింది.
అయితే వివాహమైన నాలుగు నెలలకే అదితి శర్మ ప్రవర్తన నచ్చక విడిపోయామంటూ ఆమె భర్త అభినీత్ వెల్లడించారు. అయితే ఈ విషయం అటు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అబిజిత్ తన న్యాయ సలహాదారు రాకేశ్ శెట్టితో కలిసి ఒక జాతీయ మీడియాతో మాట్లాడారు.. అదితితో తాను సుమారుగా నాలుగేళ్ల పాటు కలిసే ఉన్నానని నవంబర్ 12న మేము సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాము కానీ.. తన మీద ఏడాదికి పైగా ఒత్తిడి తేవడంతో తప్పని పరిస్థితులలో వివాహం చేసుకోవలసి వచ్చింది.. వివాహమైందనే విషయం బయట తెలిస్తే తన కెరీర్ కు ఇబ్బంది అవుతుందని చెప్పడంతో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నామని తెలిపారు. అయితే వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న అభినీత్ విడాకులు కావాలని డిమాండ్ చేశారట.. ఈమె మరొక కోస్టార్ తో సన్నిహితంగా ఉందని వీరిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా చూశాను అంటూ ఆరోపించారట. దీనివల్లే వీరు విడిపోతున్నారని.. అందుకు అదితి శర్మకు 25 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారనే విషయాన్ని అభినీత్ లాయర్ రాకేష్ వెల్లడించారు.