సీరియల్ నటి దీపిక రంగరాజు ప్రస్తుతం మాటీవీలో ప్రసారమయ్యే పలుషోలలో కనిపిస్తూ బిజీగా ఉన్నది.. ఒకవైపు సీరియల్స్ లో మరొకవైపు ఆహా షోలో ప్రసారమవుతున్న మంత్ర ప్రాజెక్టు k ,డాన్స్ ఐకాన్ 2 వంటి షోలలో కూడా కనిపిస్తూ ఉన్నది. తాజాగా ఇందుకు సంబంధించి ప్రోమో కూడా విడుదల అవ్వగా ఇందులో మ్యాడ్ స్క్వేర్ టీమ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ టీమ్ కి పిచ్చెక్కించేలా దీపిక కొన్ని పనులు చేసినట్టు ఈ ప్రోమోలో కనిపిస్తోంది.


మ్యాడ్ స్క్వేర్ చిత్రం ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ప్రమోషన్స్ కోసం హీరోలు అయిన నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ తో పాటు కమెడియన్ విష్ణు పోయి కూడా డాన్స్ ఐకాన్ 2 కి రావడం జరిగింది.. ఇక వీరి ఎంట్రీని హారతులు ఇచ్చి మెడలో దండ వేసి మరి స్వాగతం పలికింది అక్కడి టీమ్. అయితే నటి దీపిక మాత్రం లడ్డు (విష్ణు ఓయ్ ) కు తినిపిస్తూ మెడలో దండ వేసి తను కూడా మరి ఆ దండలో దూరిపోయి వెల్కమ్ చెప్పింది.



అయితే వీటన్నిటిని చూసి ఒక్కసారిగా విష్ణు ఓమ్ ఆశ్చర్య పోయినప్పటికీ దీపిక అంతటితో ఆగకుండా విష్ణు చేయి పట్టుకొని మరి రెండు స్టెప్పులేస్తూ నోట్లో లడ్డు పెడుతూ.. తన పేరేంటి అని అడుగుతూ కొంతమేరకు వారిని విసిగించినట్లు కనిపిస్తోంది. దీపిక రెచ్చిపోయి ఒక లడ్డు ఈ లడ్డుకి ఇంకో లడ్డుని తినిపిస్తోంది అంటూ లడ్డు డైలాగు కొట్టి అక్కడున్న వారందరినీ కూడా నవ్వించింది దీపిక. అయితే అక్కడున్న వారందరూ కూడా మాకేంటి ఈ కర్మ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినట్లు ఈ ప్రోమోలో కనిపిస్తోంది. మొత్తానికి ఈ ప్రోమోతో మ్యాడ్ స్క్వేర్ టీమ్ నీ భయపెట్టేలా చేసిందంటూ దీపికా పైన ఆడియన్స్ ప్రోమో కింద ఫైర్ అవుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: