
తెలంగాణ ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్స్ నియంత్రించేందుకు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నా అన్వేష్ తో తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ లైవ్ లో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి చేయకుండా ఉండేందుకు మాట్లాడుతూ అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వారు యువతను తప్పుదావ పట్టించే అంశాలను ఎవరూ చేయకూడదంటూ వారిపైన చర్యలు తీసుకోవాలంటు నా అన్వేష్, ఆర్టీసీ ఎండి సజ్జనార్ తో కూడా మాట్లాడుతూ వివరించారట.
దీంతో నా అన్వేష్ , ఆర్టీసీ ఎండి మధ్య ఈ యాప్స్ ను సంబంధించిన ప్రమోషన్స్ ని ఎలా నియంత్రించాలని అంశాల పైన కూడా చర్చించుకున్నారట. అలాగే నా అన్వేష్ ఇప్పటివరకు 128 దేశాలను తిరిగి రావడం జరిగింది. అయితే నా అన్వేష్ యొక్క నెలసరి ఆదాయం ఎంత అనే విషయం పైన తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అడగగా.. సార్ ఇవి చెప్పకూడదు కానీ మీరు అడిగారు కాబట్టి చెబుతున్నానని.. ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి 9 డాలర్స్ వస్తాయి అంటే 10 లక్షలు.. మరొక యూట్యూబ్ ఛానల్ నుంచి మూడు లక్షల పైగా వస్తుందని మొత్తం మీద నెలకు ప్రస్తుతమైతే తనకు 13 లక్షలకు పైగా వస్తోందని తెలియజేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.