సోషల్ మీడియా ద్వారా చాలామంది సెలబ్రిటీలుగా మారారు. అలాంటి వారిలో గీతూ రాయల్ కూడా ఒకరు.. ఈమె సోషల్ మీడియా ద్వారా క్రేజీ సంపాదించుకొని ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ -6 లోకి అడుగుపెట్టిన ఈమె తనదైన ఆటతీరుతో బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే తన ఓవరాక్షన్ కారణంగా హౌస్ నుంచి తక్కువ సమయంలోనే బయటికి వచ్చేసింది. ఆ తర్వాత గీతూ రాయల్ బిగ్ బాస్ లకు సంబంధించి రివ్యూలను చెబుతూ ఏడో సీజన్ కి హోస్టుగా కూడా వ్యవహరించినది. ఎప్పుడు హుషారుగా ఉండే ఈమె తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారి తీసేలా ఉన్నాయట.


గతంలో పలు వివాదాలలో చిక్కుకున్న గీతూ రాయల్.. ఇప్పుడు తాజాగా మహానటి సావిత్రి గురించి పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. తన ఇంస్టాగ్రామ్ లో తాజాగా చేసిన కామెంట్లకు నెటిజన్స్ కు సైతం చిర్రెత్చేలా చేసింది. సోషల్ మీడియాలో మాట్లాడుతూ సావిత్రి గురించి ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది.. ముఖ్యంగా ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారి జోలికి.. పెళ్లయిన వాళ్ల జోలికి గాని అసలు ఎవరు వెళ్లకూడదు.. ఈ విషయం తనకు మహానటి సినిమా చూసినప్పుడే అర్థమయిందని తెలిపింది.


సావిత్రమ్మ ఎంతో గొప్పది కానీ వివాహమైంది పిల్లలు ఉన్నారని తెలిసి కూడా జెమినీ గణేష్ ని వివాహం చేసుకుంది.. అది ఆమె జీవితంలో చేసిన ఒక పెద్ద తప్పుని.. ఆవిడ మాత్రం ఆయన్ని వేరే అమ్మాయితో చూస్తే అసలు తట్టుకోలేకపోయింది..కానీ ఆవిడ మాత్రం వేరే ఆమె భర్తని వివాహం చేసుకోవచ్చు.. సావిత్రి ఏదైతే కర్మ చేసిందో తిరిగి అదే ఆమెకు చేరింది అంటూ తెలిపింది.. మీ లైఫ్ లో కూడా అదే జరుగుతుంది. ఒకరు మీకోసం ఇతరులను వదిలేసి వస్తున్నారు అంటే కచ్చితంగా రేపటి రోజున వేరే వాళ్ళ కోసం మిమ్మల్ని కూడా వదిలేస్తారు అంటూ ఇతబోధ చేసింది.. ఈ విషయం విన్న కొంతమంది గీతూ రాయల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: