
ఇలాంటి సమయంలోనే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఎరికా ఫెర్నాండేజ్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇందులో తన వైలెంట్ రిలేషన్షిప్ గురించి పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది.. గత కొంతకాలంగా తాను ఒంటరిగా ఉన్నానని ఆ సమయంలో తాను ముందుకు వెళ్లలేకపోయానని తన జీవితంలో వచ్చిన కష్టాలు, సమస్యలు, మానసిక హింస చాలా ఇబ్బందులకు గురయ్యేలా చేశాయని అలాగే తన బ్రేకప్ పైన మాట్లాడుతూ.. తాను చాలా హింసాత్మకమైన సంబంధాన్ని అనుభవించానని తనని శారీరకంగా చాలా వేధింపులు ఎదుర్కొనేలా చేశారని తెలిపింది ఎరికా ఫెర్నాండేజ్ .
ఈ విషయం విన్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. ముఖ్యంగా ఈ విషయం పోలీసుల వద్దకు వెళితే అది వార్తగా మారుతుంది.. ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు.. ఒకవేళ పోలీసుల వద్దకు వెళితే ఫలితం ఎలా ఉంటుందో అనేది కూడా తాను కచ్చితంగా చెప్పలేనని.. అందుకే ఈ వేధింపుల విషయంలో సైలెంట్ గా ఉండిపోయానని.. సైలెంట్ గా ఉండే మహిళలని లక్ష్యంగా చేసుకొని చాలా విచిత్రమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు.. తన జీవితంలో జరిగిన విషయాలను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్న వీడియో వైరల్ గా మారుతున్నది.