
శిల్పా చక్రవర్తి మాట్లాడుతూ కరోనా సమయంలో బిగ్ బాస్ లో అవకాశం రావడం చేత తాను వెళ్లానని.. అలా వెళ్లడం వల్ల చాలా బాధపడ్డానని తన డిప్రెషన్ గురించి కూడా చాలా ఇబ్బంది పడ్డానని తెలియజేస్తూ తన యూట్యూబ్ ఛానల్ లోనే ఒక వీడియోని సైతం షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో శిల్ప చక్రవర్తి ఎమోషనల్ గా మాట్లాడుతూ.. పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువ సమయం పిల్లలకు ఇద్దామని సీరియల్స్ కి యాంకరింగ్ కి తాను బ్రేక్ తీసుకున్నానని.. అలా రియంట్రీ ఇద్దామనుకున్న సమయంలో బిగ్ బాస్ షోలో ఆఫర్ రావడంతో అక్కడికి వెళ్లానని. అయితే ఆ తర్వాత తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని తెలిపింది శిల్ప.
బిగ్బాస్ తర్వాత తనని చాలా మంది దారుణంగా ట్రోల్ చేశారని.. కొంతమంది పలు రకాలుగా బూతులు తిట్టడంతో చాలా ఇబ్బంది పడ్డానని యాంకర్ గా వేల మంది ముందు మాట్లాడిన తాను ట్రోల్స్ తర్వాత అసలు మాట్లాడే లేకపోయానని తెలిపింది. దీంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను వాటి నుంచి బయటికి రావడానికి నాలుగు నెలలు పట్టింది. తన హ్యాపీనెస్ మొత్తం పోయింది. నాకు తెలిసిన వాళ్లే తనని నెగిటివ్గా చూపించారు దీంతో బయటికి రావాలంటేనే చాలా భయం వేసిందని వెల్లడించింది. ఈమె కుటుంబం గురించి మాట్లాడుతూ.. కరోనా సమయంలో తన తండ్రి కింద పడ్డారని దీనివల్ల బ్లడ్ క్లాత్ అవడంతో కరోనా సమయం కాబట్టి ఆపరేషన్ చేయమన్నారు చివరికి తన తండ్రి హాస్పిటల్ బెడ్ మీద మరణించారని అది కూడా తన జీవితంలో ఒక పెద్ద దెబ్బ అని తెలిపింది. తన తల్లికి కూడా క్యాన్సర్ అని ప్రస్తుతం ట్రీట్మెంట్ వల్ల కోలుకుంటోందని తెలిపింది. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.