
వీటి పైన ఎన్నో సందర్భాలలో వీరిద్దరు రియాక్ట్ అయినప్పటికీ కూడా ఈ రూమర్స్ ఆగడం లేదు.. అయితే ఈ రోజున నవ్య స్వామి పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేశారు.."ఓయ్ స్వామి హ్యాపీ బర్తడే.. ఈ సంవత్సరం నీకి అద్భుతంగా జరగబోతోంది... నేను దేని గురించి అయితే చెప్పబోతున్నానో అది నీకు తెలుసు అనుకుంటాను.. నన్ను ఎప్పుడూ కూడా నువ్వు స్పెషల్ గా ఫీలయ్యే వ్యక్తికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ.. నీలాంటి వ్యక్తి ఎవరు ఉండరు నువ్వు నా లైఫ్ లోకి రావడం అదృష్టం అంటూ బర్తడే విషెస్ కి తెలియజేశారు రవి".
ఈ విషయం పైన నవ్య స్వామి రియాక్ట్ అవుతూ నాకు తెలుసు థాంక్యూ నాకు తెలుసు అంటూ ఒక కామెంట్ చేసింది. దీంతో ఈ ఏడాది ఈ జంట తమ రిలేషన్ మీద ఓపెన్ అయ్యి వివాహం చేసుకోబోతున్నారని అభిమానుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం తమ రిలేషన్షిప్ ని ఇలా కన్ఫర్మ్ చేస్తు హింట్ ఇస్తున్నారన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా నవ్య స్వామి, రవి కృష్ణ మధ్య ఏం జరుగుతుందో అంటూ ప్రశ్నించిన కూడా తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ తెలియజేశారు. మరి ఈ ఏడాది ఎలాంటి విషయంతో అభిమానులను సర్ప్రైజ్ చేస్తారు చూడాలి.