
డాక్టర్ బాబు వంటలక్క అనే పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మొదటి సీజన్ విజయవంతం కావడంతో కార్తీకదీపం 2 కూడా తీసుకువచ్చారు. గత ఏడాది స్టార్ మా లో సీజన్ 2 ని మొదలుపెట్టిన అంతగా ఆకట్టుకోలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి . ఇక ప్రేమిస్వనాథ్ వ్యక్తిగత విషయాల విషయానికి వస్తే ఈమె కేరళ ప్రాంతానికి చెందిన నటి అయినప్పటికీ కూడా 2014 నుంచి సీరియల్స్ లో నటిస్తూ ఉన్నదట.. మొదట ఈమె మలయాళ సీరియల్స్ లో నటించడంతో ఆ తర్వాత అక్కడ గుర్తింపు వచ్చి తెలుగులో డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చిందట.
2017 కార్తీకదీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె గోరింటాకు, చెల్లెలి కాపురం ఇతరత్న సీరియల్స్లలో కూడా నటించిందట. దేవి విశ్వనాథ్ ఒక్కరోజు షూటింగ్ చేస్తే ఎంత తీసుకుంటుందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఈమె ఒక్కరోజు సీరియల్ షూటింగ్లో పాల్గొంటే సుమారుగా 50వేల రూపాయల వరకు చార్జ్ చేస్తుందట. ఇలా నెలలో కనీసం 20 రోజులపాటు షూటింగ్లోనే ఉంటుందట ప్రేమివిశ్వనాథ్.. దీన్ని బట్టి చూస్తే ఈమె ఆదాయం 10 లక్షల రూపాయల వరకు ప్రతినెల ఉంటుందని తెలుస్తోంది. ఇక ప్రేమి విశ్వనాథ్ భర్త కూడా ఒక ఆస్ట్రాలజర్.. ఈమెకు ఒక కొడుకు కూడా ఉన్నారు ఇటీవలే సోషల్ మీడియాలో తన కొడుకు సంబంధించి ఫోటోలను కూడా షేర్ చేసింది.