తెలుగు బుల్లితెరపై సక్సెస్ సాధించాలి అంటే కచ్చితంగా టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి ఉండాలి.. అందం, అభినయం ఉన్నప్పటికీ అటు సినిమాలలో అవకాశాలు సంపాదించుకోలేకపోయినా జబర్దస్త్ వర్ష తన టాలెంట్ తో మాత్రం అటు సోషల్ మీడియాలో ఇటు బుల్లితెర పైన బాగానే అవకాశాలు అందుకుంటోంది. గతంలో పోలిస్తే ఈ మధ్యకాలంలో కొంతమేరకు అవకాశాలు తగ్గినప్పటికీ సోషల్ మీడియాలో తన క్రేజీ పెంచుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. అప్పుడప్పుడు ఇమ్మాన్యుయేల్ తో కలిసి చేసేటువంటి స్కిట్లు కూడా బాగానే సక్సెస్ అవుతూ ఉన్నాయి.

దీంతో వర్ష, ఇమ్మాన్యుయేల్ జోడికి కూడా బుల్లితెర పైన బాగానే ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అయితే వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ స్కిట్లలో చూపించినప్పటికీ కానీ తామిద్దరి   కేవలం స్నేహితులమే అంటూ తెలియజేస్తూ ఉంటుంది వర్ష. తాజాగా వర్ష పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.అది కూడా ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వర్ష దగ్గర బంధువుల అబ్బాయే బిజినెస్ మాన్ అన్నట్టుగా  వార్తలు వినిపిస్తున్నాయి. వర్ష పెళ్లి గురించి ఇలాంటి రూమర్స్ వినిపించడం కొత్తేమీ కాదు గతంలో కూడా వినిపించాయి.


మరి వర్ష పెళ్లిపై వస్తున్న వార్తల పైన ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుందో తెలియదు కానీ మొత్తానికి వర్ష  అభిమానులు ఈ విషయం విని ఆశ్చర్యపోయిన.. ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదా అంటూ పలువురు నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఇమే పలు సీరియల్స్ లో నటించినప్పటికీ అంతక క్రేజ్ రాలేదు కానీ ఎప్పుడైతే జబర్దస్త్ లోకి లేడీ కమెడియన్ గా కనిపించిందో అప్పటినుంచి భారీ క్రేజ్ సంపాదించుకుంది. వర్ష ఈ మధ్యకాలంలో ఇతర చానల్స్లలో కూడా హోస్టుగా చేస్తూ బాగానే పేరు సంపాదిస్తోంది.మరి రాబోయే రోజుల్లో సినిమాలలో నటిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: