తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది బంధుత్వాలు ఉన్న తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అయితే డైరెక్టర్గా అందరికీ పరిచయమైన సూర్యకిరణ్ సత్యం, రాజు భాయ్, బ్రహ్మాస్త్రం వంటి చిత్రాలను తెరకెక్కించి పరవాలేదు అనిపించుకున్నారు.. అంతేకాకుండా నటుడుగా కూడా ఎన్నో చిత్రాలలో నటించిన సూర్యకిరణ్ 11 మార్చి 2024న అనారోగ్య సమస్యలతో మరణించారు.. అయితే ఈ డైరెక్టర్ హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నారట. వివాహం చేసుకున్న కొన్ని సంవత్సరాలకే 2016లో విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే ఇ విడాకులు  తీసుకోవడం వీరిద్దరికి ఇష్టం లేకపోయినా కూడా తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.



డైరెక్టర్ సూర్య కిరణ్ చెల్లెలు కూడా ఒక నటి అన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు ఆమె సుజీత. పసివాడి ప్రాణం చిత్రంలో చైల్డ్ యాక్టర్ గా నటించి ఆ తర్వాత ఆజాద్, జై చిరంజీవ తదితర చిత్రాలలో కూడా ఈమె చెల్లెలి పాత్రలలో నటించింది. ముఖ్యంగా తన అన్న సూర్యకిరణ్, కళ్యాణికి వివాహం జరగడానికి కూడా ముఖ్య కారణం ఈమెనట. మొదట హీరోయిన్ కళ్యాణి, సుజిత మంచి స్నేహితులు ఆ తర్వాత సూర్యకిరణ్ పరిచయం అవ్వడం వల్ల కళ్యాణి, సూర్యకిరణ్ మధ్య పరిచయం ప్రేమగా మారి వివాహం వరకు దారి తీసింది.


అలా హీరోయిన్ కళ్యాణి, సుజిత కి కూడా వదిన అవుతుంది. కళ్యాణి, సూర్యకిరణ్ చాలా అన్యోన్యంగా ఉన్న సమయంలో కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. దీనివల్ల అప్పుల పాలు అవ్వడంతో అటు సూర్య కిరణ్ నుంచి కళ్యాణి విడాకులు తీసుకొని సపరేట్ అయ్యిందట. ఈ విషయాన్ని సుజీత ఒకానొక ఇంటర్వ్యూలో తన అన్న గురించి చెబుతూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది.. సుజిత పలు సీరియల్స్ లో కూడా నటిస్తూ ఉన్నది .ఇక కళ్యాణి మాత్రం ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: