
ఆరియనా మాట్లాడుతూ.. తన తల్లి సింగిల్ పేరెంట్.. తాను ఐదేళ్లు ఉన్నప్పటి నుంచి తను ఒక్కతే తనును, తన చెల్లిని పెంచిందని మా అమ్మ, పెద్దమ్మ ,మా అమ్మమ్మ, చెల్లి అందరం కూడా ఇప్పటికీ హ్యాపీగానే ఇండిపెండెంట్ గానే బతికేస్తున్నామని తెలియజేసింది. తాము ఎవరి మీద కూడా ఆధారపడి జీవించలేదని మా అమ్మ అందరితో కూడా మంచిగా ఉండమని తనకు నేర్పించింది అంటూ తెలిపింది. తన జీవితంలో మా అమ్మ , పెద్దమ్మ మా అమ్మమ్మ అందరూ కూడా సూపర్ హీరోలే అంటూ తెలియజేసింది ఆరియనా.
వాళ్ల పెంపకం వల్లే తాను తన చెల్లిని ఇంత ఇండిపెండెంట్గా హ్యాపీ జీవితాన్ని జీవిస్తున్నామని తెలియజేసింది.ఆరియనా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ..ఆరియనా తండ్రి చిన్న వయసులోనే తమను వదిలేసి వెళ్లిపోయారని అప్పటినుంచి తమ కుటుంబాన్ని తమని అమ్మే పెంచి పెద్ద చేసిందంటూ ఆరియనా తెలియజేసింది. ఆ ఒక్కటి అడక్కు, బాయ్ ఫ్రెండ్, అనుభవించు రాజా వంటి చిత్రాలలో కూడా నటించింది నటించినప్పటికీ సరైన సక్సెస్ ని మాత్రం అందుకోలేక పోయింది. హీరోయిన్గా పలు రకాల చిత్రాలలో ట్రై చేయమంటూ అభిమానులు కూడా సలహా ఇస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.