
అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ.. అలా తాను పరిచయమైన రోజే తన తల్లి మరణించిందని తెలిపారు.. ఆమె పోతూ పోతూ తనని అతడికి ఇచ్చిందని ధనరాజ్ ఫీల్ అయిపోయారని తెలిపింది. అందుకే తల్లి అంత్యక్రియలు చేయడానికి కూడా తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తన దగ్గర ఉన్న బంగారాన్ని కూడా ఇచ్చి అంత్యక్రియలు చేయించాను అంటూ తెలిపింది శిరీష. అలా ధనరాజ్ తల్లి నవంబర్లో చనిపోతే మార్చిలో వివాహం చేసుకున్నామని మాది ప్రేమ వివాహమని.. ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి 15 ఏళ్లకే తాను పెళ్లి చేసుకున్నానని తెలిపింది శిరీష.
వివాహమైన మూడవ రోజే జగడం సినిమా రిలీజ్ అయింది అక్కడి నుంచి తన భర్త ధనరాజ్ కి అవకాశాలు బాగా వచ్చాయని కానీ నిర్మాతగా ధనలక్ష్మి తలుపు తడితే సినిమా చేశాము అది నాకు ఇష్టం లేకపోయినా ధనరాజ్ చేశారు.. చాలా పోగొట్టుకున్నాము మళ్ళీ జీరో నుంచే మొదలుపెట్టామని తెలిపారు. ఆ సమయంలోనే ఏవేవో రూమర్స్ వినిపించాయి.. తన ఇల్లు అమ్మేస్తున్నారని ,విడాకులు తీసుకోబోతున్నారని రూమర్స్ కూడా వినిపించాయి. చిన్నచిన్న గొడవలే జరుగుతూ ఉంటాయి. కానీ మళ్ళీ కొద్ది రోజులకే కలిసిపోతాము..విడాకులు తీసుకునే అంత సీన్ అయితే మా మధ్య ఏమీ లేదని మేము సంతోషంగానే ఉన్నాము అంటూ తెలిపింది ధనరాజ్ భార్య శిరీష.. ఎవరు కూడా తమ జీవితం మీద ఇలాంటి రూమర్స్ రాయవద్దని తెలియజేసింది..అలాగే సుడిగాలి సుదీర్ అన్న కూడా తనకి తమ కుటుంబానికి మంచి స్నేహితురని తెలిపారు.