
ఇక ఆమె ఎవరో కాదు ఇటీవలే దేవర చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి బాగా అలరించిన నటి శృతి మరాటే.. తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఈమె సోషల్ మీడియాతో నిత్యం యాక్టివ్ గానే ఉంటుంది. ముఖ్యంగా అభిమానులతో ఫోటోలను వీడియోలను పంచుకోవడం జరుగుతూ ఉంటుంది.. అయితే శృతి మరాటె తన బరువు కారణంగా తనని చాలామంది తరచూ ట్రోల్ చేస్తూ ఉన్నారని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీనివల్ల తాను చాలా మానసికంగా కృంగిపోయి మరి ఒత్తిడికి గురికావాల్సి వచ్చిందని వెల్లడించింది.
చాలామంది తన బరువు గురించి మాట్లాడుతున్నారు అందుకే తను తనలో కొన్ని మార్పులను చోటు చేసుకున్నట్లుగా తెలియజేసింది.. ఒకప్పుడు చాలామంది నువ్వు లావుగా ఉన్నావని చెప్పేవారు అది తనని చాలా ఒత్తిడికి గురయ్యేలా చేసిందని దీంతో తాను చాలా స్లిమ్ గా మారానని.. అయితే ఇప్పుడు నువ్వు చాలా సన్నగా అయిపోయావని చెబుతూ ఉన్నప్పుడు తనకి నవ్వొస్తుందని తెలియజేసింది. ఎందుకంటే గత 20 ఏళ్ల నుంచి తాను ఇవే మాటలు వింటూ ఉంటున్నానని తెలియజేసింది. అయితే ఆ తర్వాత శరీరం గురించి ప్రజలు ఏవో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు వీటిని విని వదిలేయాలని నిర్ణయించుకున్నారని అప్పటి నుంచి అసలు పట్టించుకోలేదని ముందు మిమ్మల్ని మీరు ప్రేమించండి అంటూ తెలియజేసింది శృతి మరాటే .