తెలుగులో యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించిన ప్రదీప్ పలు చిత్రాలలో నటించడమే కాకుండా టీవీ షోలలో కూడా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మెయిల్ యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ మధ్యకాలంలో సినిమాలలో కూడా హీరోగా నటించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా మారిన ప్రదీప్ ఆ తర్వాత మళ్లీ చాలాకాలం తర్వాత రెండవ సినిమాని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని రెండో చిత్రాన్ని ప్రకటించడం జరిగింది.

ఇక ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండడంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ప్రతి యాంకర్ సుమ చాట్ షో పాల్గొనడం జరిగింది. అలాగే యాంకర్ ప్రదీప్ మొదటి సినిమా షూటింగ్ సమయంలో తనకి ఒక పెద్ద గాయం అయ్యిందని..  సర్జరీ జరిగిన కొద్ది రోజుల తర్వాత తను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలియజేశారని  తెలిపారు. కరోనా కంటే ముందు ఇది తనకు జరిగిందని.. కానీ ఆ సమయంలో ఒక ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలన్నారు.. కాలిగాయం తగ్గకుండానే షోలకి రావడం జరిగింది. అలా కొన్ని షోలకు కుట్టుకుంటూనే వచ్చాను అంటూ తెలిపారు.


అలా ఆ గాయం ఇంకా పెద్దది కావడం జరిగిందని తెలిపారు ప్రదీప్. ఆ తర్వాత రెండవ సర్జరీ జరిగిందని..సర్జరీ తర్వాత మళ్లీ వర్క్ అవుట్ కూడా చేయలేకపోయానని ప్రస్తుతమైతే రికవరీ అయ్యానని ఎక్కువగా ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాను అంటూ తెలిపారు. ఈ చిత్రంలో తను ఎక్కువగా తిరగాల్సిన పరిస్థితి ఉన్నది అందుకే రికవరీ అయ్యి కొద్దిగా గ్యాప్ తీసుకొని మరీ సినిమా షూటింగ్లో పాల్గొని సినిమాలు నటించడం వల్ల ఆలస్యం అవుతుందని తెలిపారు. అయితే ఈ విషయం మాత్రం ఇప్పటివరకు అభిమానులకు చెప్పలేదని తెలిపారు యాంకర్ ప్రస్తుతం అయితే కోలుకున్నానని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: