తెలుగు బుల్లితెర పైన సుమారుగా 10 ఏళ్లపాటు యాంకర్ గా కొనసాగించి తనకంటూ ఒక క్రేజీ సంపాదించుకున్న ప్రదీప్ ఆ తర్వాత పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలో నటించారు. కానీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి తన మొదటి సినిమాతోనే అభిమానుల చేత ప్రశంసలు పొందారు. ఇక రెండవ సినిమా చేయడానికి కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకొని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఏప్రిల్ 11వ తేదీన రాబోతున్నారు. ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల అవ్వగా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఉన్నది.


సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.. ప్రదీప్ మాట్లాడుతూ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రానికి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఈ సినిమాని తన చిన్నప్పటి స్నేహితులు నలుగురు కలిసి నిర్మాతలుగా మారారని అందుకే నేను కూడా కొంత డబ్బు ఇందులో పెట్టానని.. అందుకోసమే రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని వెల్లడించారు. సినిమా విడుదలై సక్సెస్ సాయి ప్రాపర్టీ వస్తే అందులో కొంత తీసుకుంటానని తెలిపారు ప్రదీప్.


అలాగే గత రెండు మూడేళ్లుగా షోలు రెగ్యులర్గా చేయలేదని కొన్ని కారణాల చేత తాను ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బందులు వచ్చాయని కానీ ఎలాగోలాగా మేనేజ్ చేసుకున్నానని తెలిపారు ప్రదీప్. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత యాంకర్ ప్రదీప్ హీరోగా కంటిన్యూ అవుతారా లేకపోతే బుల్లితెరపై షోలకు యాంకర్ గా సెటిల్ అవుతారా అనే విషయం ఏప్రిల్ 11న తెలియబోతోంది. అభిమానులు కూడా ఈ విషయం విన్న తర్వాత తన స్నేహితుల కోసం యాంకర్ ప్రదీప్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రశంసిస్తూ పొగిడేస్తూ ఉన్నారు. కచ్చితంగా ఈ సినిమా విజయం కావాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: