టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోగా ,నటుడుగా సుపరిచిమే సంపూర్ణేష్ బాబు. ఈ పేరు చెబితేనే చాలామంది నవ్వేసుకుంటూ ఉంటారు. ఎన్నో కామెడీ స్పూఫ్ వీడియోలను సైతం చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. హృదయ కాలేయం అనే చిత్రంతో హీరోగా మారి ఆ తరువాత కరెంటు తీగ, పెసరట్టు, సింగం 123 , కొబ్బరిమట్టు తదితర చిత్రాలలో నటించారు. అయితే ఆ తర్వాత మళ్లీ కెరియర్ పరంగా పేరు సంపాదించుకోలేకపోయారు సంపూర్ణేష్ బాబు ఇప్పటికీ కూడా అడపా దడపా చిత్రాలలో నటిస్తూ ఉన్న సంపూర్ణేష్ బాబు.. ఒకానొక సమయంలో తనకు ఎన్టీఆర్ ఒక విషయాన్ని తెలియజేశారని ఆ విషయం విని ఉంటే తాను విన్నర్ అయ్యేవారు అంటూ తెలిపారు.


బిగ్ బాస్ మొదటి సీజన్లో కాంటెస్ట్ గా సంపూర్ణేష్ బాబుకి అవకాశం లభించింది.అయితే అందులో కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉండి హౌస్ నుంచి బయటికి వచ్చేసారు. అప్పట్లో ఈ విషయం చాలా హాట్ టాపిక్ గా కూడా మారింది. అయితే హౌస్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు షో నుంచి బయటికి వెళ్ళవద్దని సంపూర్ణేష్ బాబుకి జూనియర్ ఎన్టీఆర్ సలహా ఇచ్చారట.ఆ షో తర్వాత తనకు అవకాశాలు కెరియర్ టర్నింగ్ పాయింట్ ఉంటుందని వివరించినప్పటికీ కూడా ఎన్టీఆర్ మాట వినకుండా హౌస్ నుంచి బయటికి వచ్చారట సంపూర్ణేష్ బాబు.


ఒకవేళ ఆరోజు ఎన్టీఆర్ మాట విని హౌస్ లో ఉండి ఉంటే తాను విన్నర్ అయ్యేవాడిని అంటూ టెలివిజన్ రంగంలో కూడా అదొక హిస్టరీ లాగా మిగిలిపోయేది.. మరిన్ని అవకాశాలు అందుకునే వాడిని అంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.. తనకి హౌస్ లో బంధించిన ఫీలింగ్ ఉంటుందని తన బాగా పల్లెటూరు వాతావరణానికి అలవాటు పడిపోయానని తెలిపారు సంపూర్ణేష్ బాబు. అయితే త్వరలోనే హృదయ కాలేయం సీక్వెల్ తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: