
ఇటీవలే ఒక ఎపిసోడ్ కు సంబంధించి సుధీర్ మీరు లైఫ్ లో ఎవరికైనా క్షమించమని అడగాలా అని పవిత్ర అని అడగగా.. అందుకు పవిత్ర మాట్లాడుతూ తాను సారీ చెప్పాలనుకుంటే అది తన తండ్రికేనని.. తన తండ్రితో 13 ఏళ్ల పాటు అసలు మాట్లాడలేదని ఆయన చనిపోయాక వెళ్లి మరి కాళ్ళ మీద పడి తన బాధనంత బయటకి కక్కానని కానీ పేరెంట్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్లతో మాట్లాడాలి వాళ్ళని జడ్జ్ చేసే హక్కు పిల్లలుగా మనకు లేదని నా లైఫ్ లో మా తండ్రి విషయంలో చాలా పెద్ద తప్పు చేశానంటూ ఏడ్చేసింది పవిత్ర.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారడంతో ఆమె అభిమానులు సైతం ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు.. ఇక పవిత్ర కూడా గతంలో తన తండ్రి గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఆమె తండ్రి కూడా ఒక డ్రైవర్ అని అయితే కష్టపడి సంపాదించిన డబ్బును మొత్తం తన తండ్రి తాగడానికి ఉపయోగించే వారిని దీంతో తమ కుటుంబ బాధ్యతలను అసలు పట్టించుకోలేదని.. నాకు తిండి లేకపోయినా మా నాన్నకి తాగడానికి మందు ఉంటే చాలు అందుకే ఆయనతో కొన్నేళ్లపాటు మాట్లాడడం మానేశానంటూ తెలిపింది.