
అషురెడ్డి. ఇప్పుడు తాజాగా సుధీర్ హౌస్ గా చేస్తున్న ఫ్యామిలీ స్టార్ షో లో కూడా ఈమె హొస్ట్ గానే కనిపిస్తూ ఉన్నది. ఇటీవలే ఒక ఎపిసోడ్లో మీరు ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటున్నారా అని సుధీర్ అషురెడ్డి నీ అడగడంతో ఒకసారిగా ఆమె ఎమోషనల్ స్టోరీ ని తెలియజేసింది..
అషురెడ్డి మాట్లాడుతూ ఒక అబ్బాయి తనను చాలా సిన్సియర్గా ప్రేమించారని అయితే ఆ సమయంలో తాను పదవ తరగతి ఉండడంతో ప్రపోజ్ చేస్తే ఇంట్లో కంప్లైంట్ చేశానని.. ఆ తర్వాత ఇంటర్లో ఉన్నప్పుడు మరొకరు ప్రపోజ్ చేశారు అది కూడా టీచర్స్ కి పేరెంట్స్ కి చెప్పి మరి వార్నింగ్ ఇప్పించారని.. కానీ డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఒకరోజు ఆ అబ్బాయి మరణించారని తనకి ఫోను వచ్చిందని.. చివరిసారిగా చూడటానికి రమ్మంటే వెళ్దాం అనుకున్నానని.. ఆ సమయంలో ఆ అబ్బాయి తల్లి ఫోన్ చేసి నువ్వు మాత్రం అసలు రావొద్దు అంటూ చెప్పిందని తెలిపింది..
మా అబ్బాయి నిన్ను నిజంగానే ప్రేమించారు.. ఎక్కడైతే కాలేజీలో జాయిన్ అయ్యావో అక్కడే జాయిన్ అవ్వడానికి ట్రై చేశారు.. నీ నెంబర్ కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారని చెప్పడంతో తనని అంత సిన్సియర్గా లవ్ చేసినట్టుగా అతను మరణించేవరకు తెలియదని.. చివరికి అతని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను అంటూ చాలా ఎమోషనల్ గా సారీ చెబుతూ అలాంటి వ్యక్తి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఎమోషనల్ గా తెలియజేసింది.