రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర పైన ఎన్నో షోలకు యాంకర్ గా చేస్తూ భారీగానే పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి క్రేజ్ తో పలు చిత్రాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించిన ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంతో హీరోగా మారారు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో మళ్లీ కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని ఇప్పుడు తాజాగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఇందులో హీరోయిన్గా దీపిక పిల్లి నటిస్తోంది ఏప్రిల్ 11న రాబోతున్నది.


ఇటీవలే ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ లో పాల్గొన్న యాంకర్ ప్రదీప్ ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి గురించి పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత కొంతకాలంగా యాంకర్ ప్రదీప్ ఒక రాజకీయ నాయకురాలితో ప్రేమలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయని వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని విషయం పైన యాంకర్  ప్రదీప్ ను ప్రశ్నించారు.


అందుకు యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అందుకే కష్టపడుతున్నాను తాను పెట్టుకున్న ఒక టార్గెట్ ని పూర్తి చేయాలని కల నిజమయ్యే వరకు తాను పెళ్లి గురించి అసలు ఆలోచించను అంటూ తెలిపారు. అనుకున్న టైములో అన్ని కరెక్ట్ గా అవుతాయని నమ్ముతానని తెలిపారు ప్రదీప్.. ఈ మధ్యకాలంలో పొలిటిషన్ తో కూడా తన పెళ్లి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి, మరొకసారి రియల్ ఎస్టేట్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో పెళ్లి అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు.ఇవన్నీ కూడా రూమర్సే.. ఎవరో ఒకరితో పెళ్లి అవుతుందని చెప్పడం చాలా సరదాగా మారిపోయిందని తెలియజేశారు ప్రదీప్. మొత్తానికి పెళ్లి పై క్లారిటీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: