
ముఖ్యంగా నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. నా ముందు ఒకలాగా.. నా వెనుక ఇంకో లోగా ప్రవర్తించారు. ఇటు డబ్బు గుర్తింపు వచ్చిన తర్వాత కూడా నాకు నా స్నేహితుల నుంచి సరైన ప్రేమ లభించడం లేదు. అయితే ఒకసారి కావాలనే పిలిచి మరి నన్ను అవమానించారు. ఏదో ఒక డాన్స్ ఈవెంట్ ఉందని నన్ను ఆహ్వానించారు. దాంతో నేను ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసి మరి ఆ ఈవెంట్ కి వెళ్లాను అయితే అక్కడ ఆర్టిస్టులు రెడీ అవ్వడానికి ఒక గుడిసె వేశారు. ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు. కానీ నన్ను పిలవలేదు. ఆఖరికి ఒక ఆర్టిస్టు నా ప్రోగ్రాం ఉంది రెడీ అవ్వాలి. కాసేపు అద్దం పట్టుకుని నిలబడు అంటే గంటసేపు ఆ ఆర్టిస్ట్ కోసం నేను అద్దం పట్టుకొని నిలబడ్డాను. ఇక అప్పుడే నాకు అర్థం అయింది. నన్ను కావాలని పిలిచే అవమానించారు అని..
ఇక ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేను.. ముఖ్యంగా నాతో చాలామంది ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నారు. కానీ వారి నుంచి నిజమైన ప్రేమ నాకు లభించడం లేదు. అంటూ వర్షా ఎమోషనల్ అయింది. ప్రస్తుతం వర్షా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.