
బ్రహ్మముడి సీరియల్ లో తన నటనతో మెప్పించిన దీపికా వరుస టీవీ షోలలో తెగ హడావిడి చేస్తూ ఉంది. వచ్చిరాని తెలుగుతో అందరినీ ఆకట్టుకుంటున్న దీపికా రంగరాజు ఈమె చేసే పనులు చూసి చాలా మంది నెటిజెన్స్ ఇంత ఓవరాక్షన్ అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏకంగా నాచురల్ స్టార్ నానితోనే నటించే అవకాశాన్ని అందుకున్నది. అయితే వీరిద్దరూ కలిసి తాజాగా ఆశీర్వాద్ కారంపొడి యాడ్ లో కనిపించారు. ఇందులో ఆశీర్వాద్ కారంతో రకరకాలు వంటలు చేసి మరి హీరో నానికి రుచి చూపిస్తోంది నటి దీపికా.
ఇక దీపికా వంటల్ని రుచిచూసినటువంటి హీరో నాని ఆమెతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను దీపిక రంగరాజు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అంతేకాకుండా హీరో నానిని కూడా పొగడ్తలతో ముంచేసింది.. నాని గారి సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోయాను ఆయనతో కలిసి యాడ్ చేస్తున్నానంటూ కొన్ని ఫోటోలను వీడియోలను షేర్ చేసింది. అయితే ఇందులో ఈమె నాని సిస్టర్ గా కూడా నటించింది. హీరో నాని, దీపికా సంబంధించి యాడ్ కూడా వైరల్ గా మారుతున్నది. మొత్తానికి అన్నా చెల్లెళ్ల యాడ్ తో అటు నాని, దీపికా ఇద్దరు కూడా దుమ్ము దులిపేశారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీపికా రాబోయే రోజుల్లో కూడా వెండితెర మీద పలు సినిమాలలో నటించే అవకాశాలు ఉన్నట్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.