
ముఖ్యంగా అలేఖ్య అనే అమ్మాయి దారుణంగా తిట్టడంతో మొదట ఈ వివాదానికి దారితీసింది. దీంతో చాలామంది నెటిజెన్స్ కూడా దారుణంగా మాట్లాడడంతో తిరిగి ముగ్గురు అక్క చెల్లెలు క్షమాపణలు కూడా తెలియజేశారు. అయినా కూడా వీరి మీద ఎలాంటి కనికరం లేకుండా ట్రోల్ చేస్తూ ఉన్నారు. చాలా మంది సినిమాల ప్రమోషన్స్ కి కూడా వాడేస్తూ ఉన్నారు తాజాగా ఈ విషయం పైన బిగ్ బాస్ గీతూ రాయల్ మాట్లాడుతూ ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది.
వీడియోలో మాట్లాడుతూ కోపం వస్తే మగవాళ్లే కాదు ఆడవాళ్లు కూడా బూతులతో రెచ్చిపోవడం సహజం.. కానీ ఎవరితో మాట్లాడుతున్నావ్ అనే విషయాలను చూసుకోవాలి.. ఇప్పటికీ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది తాను మాట్లాడేది అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి అంటూ తెలుపుతోంది. ఒక కస్టమర్ ఏదో అడిగారని అమ్మనా బూతులు తిట్టిన ఒక ఆడియో వైరల్ అయ్యింది. దీనివల్ల అటు కాంట్రావెర్సీలు, ట్రోల్స్ సైతం వినిపించాయి. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు.ముగ్గురు క్షమాపణలు చెప్పిన ఎవరూ పట్టించుకోలేదు..
తప్పు అనేది అందరూ చేస్తారు.. కాబట్టి ట్రోల్స్ చేసే వారందరూ కూడా పతిత్తులు కాదు వారు స్వారీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళని వదిలేయాలి ఇలా దారుణంగా ట్రోల్ చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారు.. మరి కొంతమంది ఏకంగా చనిపోయిన వాళ్ళ తండ్రిని కూడా మధ్యలోకి తీసుకువస్తున్నారు. అలా చేయడం తప్పు అంటూ తెలియజేసింది.. బ్రతికి ఉన్నవారు చనిపోయే వరకు తీసుకు వెళ్ళకండి అంటూ గీతూ రాయల్ ఒక వీడియోని విడుదల చేసింది.