గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు అలేఖ్య చిట్టి పీకిల్స్. కేవలం ఒక్క వాయిస్ మెసేజ్ వల్ల ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు చాలా విపరీతంగా ట్రోల్స్ కి గురయ్యారు. పచ్చల రేట్ ఎక్కువగా ఉందని అడిగినందుకు ఒక కస్టమర్ ను బూతులు తిట్టడం వల్ల వేరే బిజినెస్ ఏ కాకుండా వీరి గురించి కూడా చాలా నెగటివ్ వైరల్ గా మారింది. దీంతో వీరు క్షమాపణలు చెప్పిన కూడా అందుకు సంబంధించిన ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు.


వాస్తవానికి ఇంస్టాగ్రామ్ లో ఈ ముగ్గురు అక్క చెల్లెలు కొన్ని మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ని సంపాదించారు. అంతేకాకుండా ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ కి వెళ్లే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  నాన్ వెజ్ పచ్చళ్ళు ప్రమోట్ చేస్తూ కూడా కొన్ని మిలియమ్స్ ఫాలోవర్స్ సంపాదించుకున్న రమ్య బిగ్ బాస్ లోకి వెళ్లబోతున్నట్లు ప్రచారం వినిపించింది. తాజాగా ఈ రూమర్స్ పైన స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేసింది.


సుమ మాట్లాడుతూ అలేఖ్య సిస్టర్ లో ఒకరు బిగ్ బాస్ లోకి వెళ్లబోతున్నారని భారీగా డబ్బులు తీసుకుంటున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్న అందులో ఎలాంటి నిజం లేదని తెలిపింది. గత కొద్దిరోజుల క్రితం తాను యూట్యూబ్లో ఒక వీడియోని మాత్రమే చేశానని అందులో తనకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని కోరిక ఉన్నదని..ఛాన్స్ వస్తే కచ్చితంగా వెళ్తామని చెప్పారు. అయితే ఆ వీడియోని పట్టుకొని ఇప్పుడు చాలామంది పలు రకాల రూమర్స్ సృష్టిస్తున్నారని తెలియజేసింది. తమకు బిగ్ బాస్ నిర్వహింపులు కూడా ఎప్పుడు ఎలాంటి ఫోన్ చేయలేదని అందుకు సంబంధించి సుమ ఒక వీడియోని కూడా షేర్ చేయడం జరిగింది. ఇందులో కూడా పలు రకాలుగా నేటిజన్స్ స్పందిస్తూ ఉన్నారు. మరి ఇకనైనా  ఈ రూమర్స్ ఆగుతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: