
అయితే సీరియల్స్ కోసం ఇందులో కొంత మంది నటీనటుల రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ సీరియల్లో రాజ్ కంటే ఎక్కువగా కావ్యనే ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీరియల్ లో ఒక్కో ఎపిసోడ్కి మానస్ రూ.30 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో సుమారుగా 20 రోజులపాటు ఈ సీరియల్స్ షూటింగ్లో మానస్ పాల్గొంటారట. అలా నెలకు రూ.5 నుంచి రూ.6 లక్షలు తీసుకుంటున్నారు.
ఈ సీరియల్ లో నటిస్తున్న దీపిక రంగరాజు కూడా ఒక్కో ఎపిసోడ్ కి 35వేల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. అలా నెలకి కూడా సుమారుగా రూ.6 నుంచి రూ.7 లక్షల రూపాయల వరకు అందుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఈ సీరియల్ లో విలన్ పాత్రలో నటిస్తున్నటువంటి రుద్రాణి (షర్మిత గౌడ) కూడా ఒక్కో ఎపిసోడ్కి 20వేల రూపాయల వరకు తీసుకుంటున్నది.. అలా నెలకి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. అలా మొత్తానికి బ్రహ్మ ముడి సీరియల్ ద్వారా దీపికా రంగరాజు, షర్మిత గౌడ ఇద్దరు కూడా కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.