
విరు జబర్దస్త్ ద్వారా భారీ పాపులారిటీ అయ్యారు. దీంతో సినిమాలలో కూడా అవకాశాలను సంపాదించుకున్నారు. అలా అనసూయకు మంచి ఫేమ్ తో పాటు నేమ్ తెచ్చిపెట్టిన జబర్దస్త్ కి వీడడానికి అనసూయకు ఎన్నో కారణాలు ఉన్నాయి. సినిమాల వల్లే అనసూయ జబర్దస్త్ దూరం అయ్యిందనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే అనసూయ స్థానాన్ని భర్తీ చేసేందుకు కన్నడ సిని పరిశ్రమ నుంచి బుల్లితెర నటి సౌమ్యరావుని యాంకర్ గా తీసుకురావడం జరిగింది.
ఇప్పుడు ఎక్కువగా కన్నడ సినీ నటులదే హవ ఎక్కువగా కనిపిస్తోంది. ఏ సీరియల్లో చూసిన వీరే ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎక్కువమంది ఈ మధ్య కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారు. అయితే అలాంటిది ఇప్పుడు తెలుగులో టాప్ ప్రోగ్రామ్కు కూడా కన్నడ నటిని తీసుకురావడం కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వచ్చిరాని తెలుగుతో పర్వాలేదు అనిపించుకున్న సౌమ్యరావు ఎంత కష్టపడినా కూడా తన గుర్తింపుని సంపాదించుకోలేకపోతోంది. చాలామంది ట్రోల్ చేయడం కూడా జరిగిన.. సౌమ్య రావు స్థానంలో జబర్దస్త్ ఆమె ప్లేస్ లోకి సిరి హనుమంతుని తీసుకోవచ్చారు. జబర్దస్త్ నుంచి తీసేయడం పైన మాట్లాడింది..
ఇటీవల సౌమ్య రావు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మీ, అనసూయ లాగా తాను గ్లామర్ షోలు చేయలేకపోవడం వల్లే వెనకబడిపోయారని ప్రశ్నని యాంకర్ అడగగా.. అందుకు సౌమ్య రావు గ్లామర్ షో చేయవలసిన పనిలేదని అలా చేయకపోయినా తన అవకాశాలు వస్తున్నాయని వెల్లడించింది. ఇతర యాంకర్లతో తనకి ఎలాంటి సంబంధం లేదని ఘాటుగాని సమాధానాన్ని తెలిపింది సౌమ్యరావు.