తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే కార్తీకదీపం సీరియల్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించారు డాక్టర్ బాబు. 2006లో బుల్లితెర పైన ఎంట్రీ ఇచ్చిన నిరూపమ్ పరిటాల బ్యాక్ టు బ్యాక్ పలు సీరియల్స్ లో నటిస్తూ ఉన్నారు. దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా బుల్లితెర పైన ఒక వెలుగు వెలుగుతున్నారు నిరూపమ్ పరిటాల. ఈయన వ్యక్తిగత విషయాలు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్ లో నటిస్తున్న డాక్టర్ బాబు ఆదాయం తెలిస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే



బుల్లితెర పైన ఎంత అనుభవం ఉన్నప్పటికీ నిరూపమ్ పరిటాలకు ఒక్కరోజు షూటింగ్ 30 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా కుమారి శ్రీమతి, హిట్లర్ గారి పెళ్ళాం వంటి సీరియల్స్ లో కూడా నటిస్తూ ఉన్నారు. ఇలా ప్రతిరోజు మూడు సీరియల్స్ లో నటిస్తూ ఏకంగా రోజుకి 80 వేల రూపాయలకు పైగా సంపాదిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రతి నెల 15 లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తున్నట్లు కనిపిస్తోంది.


బుల్లితెర పైన ఎంతో అనుభవం ఉండడంతోనే నిరూపం పరిటాల చాలామంది నిర్మాతలు పలు సీరియల్స్ లో నటింపచేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఇవే కాకుండా పలు రకాల యాడ్స్లలో కూడా కనిపిస్తూ ఉన్నారు. గతంలో కూడా పలు చిత్రాలలో కూడా నటించడం జరిగింది డాక్టర్ బాబు. కార్తీకదీపం 2 సీరియల్ తో మరొకసారి తన హవా కొనసాగిస్తున్నారు. ఇక హైదరాబాదులో కోటి రూపాయలు విలువ చేసే ఒక ఇల్లు. 8 కోట్ల రూపాయలు విలువచేసే పొలంతో పాటు రెండు ఖరీదైన కారులు ఉన్నాయట అలాగే నీ రూపం తన కుటుంబం పేరు మీద కొన్నిచోట్ల పొలాలు కొన్నట్లుగా తెలుస్తోంది. అలా మొత్తం అంతా ఆస్తి కలిపి సుమారుగా 15 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందట. ఇక చంద్రముఖి సీరియల్ లో నటించిన మంజులను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: