ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు అలా ప్రేమలో పడి ఇలా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే అలా ప్రేమ, పెళ్లి చేసుకున్న కొన్ని జంటలు మాత్రమే వైవాహిక బంధాన్ని కొనసాగిస్తుంటే.. మరికొన్ని జంటలు తమ వ్యక్తిగత కారణాలవల్ల విడాకులు తీసుకుంటూ వేరు పడుతున్నారు.  ఇక అలా వేరుపడిన వారు మళ్ళి కొన్నేళ్ళకు కొత్త బంధాన్ని వెతుక్కుంటున్న విషయం తెలిసిందే. ఇథిలా వుండగా ప్రముఖ యాంకర్ గా పేరు సొంతం చేసుకున్న ప్రియాంక దేశ్ పాండే  తన అభిమానులకు శుభవార్త తెలిపింది.


తమిళ్ బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పాల్గొని అలరించిన ఈమె..  సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న యాంకర్ గా కూడా పేరు సంపాదించింది. ఇప్పుడు తన ప్రియుడితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది.  ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. యాంకర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రియాంక 'డీజే వాసి సచ్చి' తో ఏడడుగులు వేసింది. ఏప్రిల్ 16న కొంతమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా వీరి వివాహం జరగగా.. ఈరోజు ప్రియాంక తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ ఫోటోలను పంచుకుంది. ఇకపోతే ఈ ఫోటోలు చూసిన అభిమానులు పలు రకాల కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.


ఇకపోతే ప్రియాంక దేశ్ పాండే అభిమాని ఈ ఫోటోలను చూసి ఒక ప్రేమపూర్వక సందేశాన్ని ఆమె కోసం పంపించారు.. మనం కోరుకునే అందమైన ప్రేమ దొరకడం అత్యంత అందమైన విషయం. ప్రేమ అంటే యవ్వనంగా కనిపించడం కాదు.. పరిపూర్ణంగా ఉండడం అసలే కాదు..  ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకొని, ఒకరినొకరిని సంతోష పెట్టేది ఏమిటో తెలుసుకోవడం.. ఒకరి గురించి మరొకరు చిన్న విషయాలను కూడా మార్చుకునేంత శ్రద్ధ వహించడం. అదే అసలైన ప్రేమ. ప్రియాంక సంతోషకరమైన,  స్వచ్ఛమైన  ప్రేమకు మీరు అర్హులు. ఇక మీకు కావలసిన ప్రేమ దొరకడంతో మీరు మరింత అదృష్టవంతులుగా మారిపోయారు.  ఇప్పుడు మీరు ఇలా సంతోషంగా ఉండడం చూసి, నా హృదయం ఉప్పొంగిపోతోంది. మీకు చాలా చాలా సంతోషకరమైన వివాహ జీవితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ ఆ అభిమాని ప్రియాంక దేశ్ పాండేకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ప్రేమ మొత్తాన్ని ఇలా సందేశం రూపంలో పంపించారు.


2016లో ప్రియాంక దేశ్ పాండే యాంకర్, సీనియర్ నిర్మాత ప్రవీణ్ కుమార్ ను వివాహం చేసుకుంది. వైవాహిక బంధం లో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట వ్యక్తిగత కారణాలవల్ల 2022లో విడాకులు తీసుకున్నారు. అలా ఆరేళ్ల వైవాహిక బంధంలో ఏర్పడిన వ్యక్తిగత కారణాలవల్ల ఈ జంట విడిపోయింది. ఇక అప్పటినుంచి ఒంటరిగా ఉన్న ప్రియాంక డీజే తో పరిచయం ఏర్పడి, అతడి ప్రేమలో పడి ఇప్పుడు పెళ్లి  చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: