గతంలో లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రారంభించినటువంటి పాడుతా తీయగా సింగర్ షో ఇప్పటికీ దిగ్విజయంగానే ఈటీవీలో ప్రసారమవుతూ ఉన్నది. అయితే ఆయన మరణం అంతరం తన కుమారుడు ఎస్పీ చరణ్ ఈ షోకి హొస్టుగా వస్తూ ఉన్నారు. అయితే ఇటీవలే మొదలైనటువంటి ఈ షో సిల్వర్ జూబ్లీకి.. హొస్టుగా కీరవాణి, చంద్రబోస్, సునీత వంటి వారు జడ్జిలుగా ఉన్నారు. సింగింగ్ రియాల్టీ షోలో ముందంజలో ఉన్నటువంటి గాయని ప్రవస్థి ఆరాధ్య నిన్నటి రోజు నుంచి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.



ఈ షోలో అసలు న్యాయం జరగడం లేదని టాలెంట్ ఉన్నవాళ్లే కాకుండా నచ్చిన వాళ్ళను మాత్రమే విజేతలుగా చూపిస్తున్నారంటూ ఆమె ఆరోపించింది. అంతేకాకుండా తన యూట్యూబ్ ఛానల్ లో కూడా సునీత, చంద్రబోస్ , కీరవాణి పైన సంచలన ఆరోపణలు చేసింది. ముఖ్యంగా జడ్జి సీటులో ఉండి న్యాయానికి అన్యాయం చేస్తున్నారని తనను మెంటల్గా హింసించారని బాడీ షేవింగ్ కామెంట్స్ కూడా చేశారని ఆరోపణలు చేసింది. తాను ఇక మ్యూజిక్ ఫీల్డ్ కి దూరం కావాలని నిర్ణయించుకున్నాకే అందుకు సంబంధించిన వీడియోను చేశానని ఇందులో పెద్దపెద్ద వాళ్ల పేర్లు కూడా తీసుకువచ్చాను కాబట్టి తనకు ఎలాగో అవకాశాలు రావు కానీ నిజాలు తెలియాలి అంటూ ఈ వీడియోని చేశానని తెలిపింది.


సింగర్ సునీతకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచే తాను స్టేజి మీదకి రాగానే ఆమె ముఖం అదోలా పెడుతూ ఉంటుంది. దీంతో అభిమానులు తనని మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని మెసేజ్ చేసే వారిని కానీ తాను ఆ విషయాన్ని నమ్మలేదు రాను రాను తాను గమనించానని ఆమెకు నేనంటే అసలు నచ్చలేదని తెలిపింది. అందుకే తప్పులేకున్నప్పటికీ కూడా నెగిటివ్గా కామెంట్లు చేస్తూ ఉంటుందని తెలిపారు.


ఇక చంద్రబోస్ గారు అయితే లిరిక్స్ తప్పులు ఉంటే ఆయనే చెప్పాలి మొదటి రెండు ఎపిసోడ్లు తనని మెచ్చుకున్నారు.. దీంతో తనకు తప్పులు దొరకకపోవడంతో మరొక లాగా వేధించారని తెలిపింది.

కీరవాణి గారి  నుంచి నెగిటివ్ కామెంట్స్ రాలేదు కానీ .. ఆయన పాడిన పాటలు పాడితేనే ఎక్కువ మార్కులు వేస్తారని తెలిపింది. జడ్జిలు విపక్ష చూపడడం తన బాడీ మీద జోకులు వేయడం, తనని మెంటల్గా ఎఫెక్ట్ అయ్యేలా చేశాయంటూ తెలిపింది.

తన కెరియర్లో చాలా షోస్ చేశాను కానీ ఎప్పుడు ఏ జడ్జి కూడా తనని ఏ మాట అనలేదని తెలిపింది. తనలాగే చాలామంది కూడా ఇక్కడ సఫర్ అయ్యారని తెలిపింది ప్రవస్థి ఆరాధ్య. ఇక తమలాంటి వారి జీవితాలతో అసలు ఆడుకోకండి నాకు ఏమైనా అయిన నా ఫ్యామిలీకి ఏం జరిగినా కూడా సునీత చంద్రబోస్ కీరవాణి లతోపాటు జ్ఞాపిక ప్రొడక్షన్ వారిదే బాధ్యత అంటూ ప్రవస్థి తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: