గత నెలలో మయన్మార్, థాయిలాండ్ ఇండోనేషియా ఇతరత్న దేశాలలో కొంతమేరకు భారీ భూకంపాలు సంభవించాయి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. దీనివల్ల లక్షలాదిమంది ఇల్లు కోల్పోయి రోడ్డున కూడా పడ్డారు. ఈ భూకంప బాధితులలో ప్రముఖ యూట్యూబర్ శ్రావణి (బ్యాంకాక్ పిల్ల) కూడా ఉంది. తెలుగు యూట్యూబర్ గా మంచి పేరు సంపాదించిన శ్రావణి భారీ భూకంపం కారణంగా తాను ఉంటున్న అపార్ట్మెంట్ కూడా చాలా డ్యామేజ్ అయ్యిందని కూలిపోలేదు కానీ భారీగా బీటలు పగిలింది అంటూ తెలిపింది.


అయితే అది ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉందంటూ అక్కడ నివాసం ఉండే వారందరినీ కూడా ప్రభుత్వమే మరి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించింది అంటూ తెలిపింది. అలా బ్యాంకాక్ పిల్ల కూడా తన ఇంటిని వదిలి పెట్టాల్సి పరిస్థితి ఏర్పడిందట. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసింది.. తట్ట బుట్ట అన్ని సర్దుకొని రోడ్డును పడ్డాము అంటూ ఒక వీడియోని అప్లోడ్ చేసింది. దీంతో ఈమె పరిస్థితి చూసి ఆమె అభిమానులు యూజర్స్ చాలా ఫీల్ అయ్యారు.


అయితే తాజాగా యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోని అప్లోడ్ చేస్తూ ఇందులో బ్యాంకాక్ పిల్ల సిటీకి కాస్త దూరంగా ఒక పెద్ద విల్లాను సైతం చూపించింది.. దీంతో తాము అందులోకి షిఫ్ట్ అయిపోయాము అంటూ తెలియజేసింది.అంతేకాకుండా తన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా తన బంగ్లాను మొత్తం తిప్పి చూపించింది. ఈ విల్లాలో అన్ని సౌకర్యాలు కూడా ముందు నుంచే ఉన్నాయని తెలియజేసింది.కేవలం తాము బట్టలు సర్దుకోవడం ఆలస్యం అంటూ తెలియజేసింది. అలాగే ఈ వీడియోలో ఈ ఇల్లు అద్దెక్కి తీసుకున్నట్లుగా తెలియజేసింది. ప్రస్తుతం తమ సబ్స్క్రైబర్లకు తన కొత్త ఇంటిని పరిచయం చేయడంతో సబ్స్క్రైబర్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: