అంతరిక్ష పరిశోధనల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. మరికొన్ని గంటల్లో PSLV-C-36 రాకెట్‌ను నింగిలోకి పంపించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న వాహకనౌక ద్వారా భూమిపై వాతావరణ పరిస్ధితుల పరిశోధనల నిమిత్తం రూపొందించిన ఉపగ్రహాన్ని ఈ ఉదయం విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు.