అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచవ్యాప్త సమాచారం మన గుప్పెట్లోనే ఉంటుంది. అంతగా సెల్ ఫోన్ లకి మనవాళ్ళు అడిక్ట్ అయిపోయారు మరి. స్నేహితులతో కబుర్లు చెప్పడం దగ్గర నుంచీ ముక్కూ మొహం తెలీనివారితో చాటింగ్ ల వరకూ అన్నీ ఇందులోనే ఉండడం దీని ప్రత్యేకత. తల్లిదండ్రులు వారి పిల్లల కంటే స్మార్ట్‌ఫోన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని నిపుణులు తేల్చి చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో సరదాగా గడిపే సమయంలో నాలుగో వంతు కూడా పిల్లలతో గడపడానికి కేటాయించడం లేదట‌. మ‌రోవైపు స్మార్ట్‌ఫోన్ ప్ర‌భావం అత్య‌ధికంగా ప‌డిన భార్యాభర్తలు కూడా ఒకరితో ఒకరు సమయం గడిపే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నారట‌. ఈ ప‌రిస్థితే కుటుంబ వ్య‌వ‌స్థ దెబ్బ‌తిని, ఒత్తిడి పెరగ‌డానికి కార‌ణం అవుతోంది. స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్న సోష‌ల్ మీడియా వంటి ఫీచ‌ర్ల‌తో అప‌రిచిత వ్య‌క్తుల ప‌రిచ‌యాలూ అధిక‌మే. వీటికార‌ణంగానే న్యాయస్థానాలకు వచ్చే సగం విడాకుల కేసులకు ఈ మూడో వ్యక్తే కారణమ‌ని లాయ‌ర్లు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: