టెలికాం ప్రత్యర్థుల గుండెల్లో ఎప్పడికప్పుడూ రైళ్లు పరిగెత్తించే రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ అందించింది. కంపెనీ తన ప్రీపెయిడ్‌ యూజర్లకు కొత్తగా డబుల్‌ ధమాకా ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద అదనంగా తన యూజర్లకు 1.5 జీబీ డేటా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో ఈ ఆఫర్‌ను మంగళవారం ప్రకటించింది.
Jio Takes On Airtel With New Double Dhamaka Offer - Sakshi
ఎయిర్‌టెల్‌ ఇటీవలే తన రూ.149, రూ.399 ప్లాన్లపై అదనంగా 1 జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది. దీనికి కౌంటర్‌గా జియో తన ఎంపిక చేసిన ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్యాక్‌లపై అదనంగా 1.5 జీబీ డేటా ఇవ్వనున్నట్టు పేర్కొంది.  ఈ రోజు సాయంత్రం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఈ అదనపు డేటా అందుకోవచ్చు. రూ.149, రూ.349, రూ.399, రూ.449, రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్ల‌కు అదనంగా రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున అదనంగా అందుకోవచ్చు.

అంతే కాకుండా రూ.509 ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే రోజుకు 4 జీబీ డేటాకు బ‌దులుగా 5.5 జీబీ డేటా, రూ.799తో రీచార్జ్‌ చేసుకుంటే రోజుకు 5 జీబీ డేటాకు బ‌దులుగా 6.5 జీబీ డేటా వస్తుంది. అలాగే, రూ.399 ప్లాన్‌ను జియో యాప్‌లో ఫోన్‌పే ద్వారా రీచార్జి చేసుకుంటే రూ.100 డిస్కౌంట్ లభించే ఆఫర్‌ను కూడా పొడిగించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: