ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ తోనే రన్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఉదయం లేచిన మొదలు..పడుకునే వరకు ఏదోఒక విధంగా మనిషి టెక్నాలజీని వాడుకుంటున్నారు.  ఒకప్పుడు మనుషుల మద్య కమ్యూనికేషన్ అంటే ఈమెయిల్స్ మాత్రమే ఉండేవి..కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.  వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా ఎన్నో సోషలమ మాద్యమాలు వచ్చాయి. తాజాగా వాట్సాప్ తో అయితే ఏకంగా లైవ్ గా మనుషుల మద్య ఛాటింగ్, టాకింగ్ లాంటివి నడుపుకునే వెసులు బాటు కల్పించబడింది. 


ఒక్క వాట్సాప్ గ్రూప్ తో ఎంతో మంది మెసేజ్ లు చేసుకునే అవకాశం కల్పించబడింది.  మెసేజ్‌ లతో పాటు ఫోటోలు, వీడియో, ఆడియో క్లిప్పింగ్‌ లను స్నేహితులు, బంధుమిత్రులతో క్షణాల్లో పంచుకునేందుకు సహకరించే వాట్స్‌ యాప్‌, ఇప్పుడు మరో నాలుగు కొత్త ఫీచర్లను దగ్గర చేయనుంది. వాటిల్లో అతి ముఖ్యమైనది, ఎవరైనా క్రియేట్‌ చేసిన గ్రూపుల్లో ఒకరి అనుమతి లేకుండా చేర్చడం ఇకపై జరగబోదు. గత కొంత కాలంగా ఎవరో క్రియేట్‌ చేసే గ్రూపులో తమంతట తామే చేరిపోతున్నామని, తమకు ఇష్టం లేకుండానే ఇది జరిగిపోతోందని పలువురు ఫిర్యాదులు చేయడంతో.. వాట్స్‌ యాప్ ఈ నిర్ణయం తీసుకుంది.


ఇకపై ఎవరైనా, ఎవరినైనా ఏదైనా గ్రూప్‌ లో చేరిస్తే, 72 గంటల్లోగా దాన్ని‌ చూసి, యాక్సెప్ట్‌ లేదా రిజెక్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కస్టమర్ తన నంబర్ ను గ్రూప్స్ లో యాడ్ చేయవద్దు అనే ఆప్షన్‌ ను కూడా వాట్స్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్న స్మార్ట్ ఫోన్లలో వేలిముద్ర సాయంతో అన్‌ లాక్‌ చేసుకునే సదుపాయాన్ని, స్పామ్‌ మెసేజ్‌ లను సులువుగా గుర్తించేందుకు 'ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్‌' పేరిట సరికొత్త ఫీచర్‌ ను కూడా వాట్స్ యాప్ ప్రారంభించింది. అంతే కాదు ఇప్పుడు మరింత చేరువ అయ్యే విధంగా వరుసగా వచ్చే వాయిస్‌ మెసేజ్‌ లను ఒకదాని తరువాత ఒకటి వినేందుకు వీలుగా మరో సరికొత్త ఫీచర్ ను తయారు చేస్తున్నట్టు కూడా వాట్స్ యాప్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: