నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రపంచం.. దేన్నైనా సాధించ‌గ‌ల‌ము అన్న రీతిలోకి మారుతుంది. టెక్నాలజీ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పుంత‌లు తొక్కుతూనే ఉంది. అన్నీ అరచేతిలో ఇమిడే స్థాయికి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడో సరికొత్త స్మార్ట్‌ఫోన్ వ‌చ్చేసింది. ఈ కొత్త ర‌కం ఫోన్ చేతికి బ్రెస్‌లెట్ రూపంలో తయారు చేశారు. దీన్ని ఎక్క‌గైనా.. ఎలాగైనా ఉప‌యోగించుకోవ‌చ్చు.


మ‌నం స్మార్ట్ ఫోన్ల‌ను ఎలా యూజ్ చేసుకుంటామో అలాగే దీన్ని కూడా యూజ్ చేసుకోవ‌చ్చు. కానీ ఇది మీ చేతిపై ఉంటుంది. కాల్స్ మాట్లాడ‌డం, వాతావరణాన్ని చెక్ చేయ‌డం, మెయిల్‌లను చదవ‌డం, ఇంటర్నెట్ బ్రౌజింగ్‌, గేమ్స్, వాట్పాప్ చాటాంగ్‌, ఫేస్‌బుక్ ఇలా అన్నిటినీ దీనిలో ఉప‌యోగించుకోవ‌చ్చు. 


టచ్‌స్క్రీన్ ఫోన్‌లను పట్టుకుని అలసిపోయిన వాళ్ల‌కు ఇది బాగా యూజ్ అవుతుంది.ఆకట్టుకునే తెరతో ఎటుకావాలంటే అటు వంచుకునేందుకు వీలుండే స్మార్ట్‌ఫోన్లను తీసుకువ‌చ్చింది. ఇందులో స్క్రీన్‌ని ఎటు వైపు వంచినా టచ్‌ సదుపాయం పనిచేసేవిధంగా ఉంటుంది. ఈ సీక్రెట్ బ్రేస్‌లెట్ ధ‌ర్‌ $400లు. అయితే దీన్ని మరింత డెవలప్ చేయడానికి $810,000 ఖర్చు అవుతున్నాయి. 


ఒక శాంపిల్ తయారు చేయడానికి $340,000 డాలర్స్ ఖర్చు అవుతుంది. ఇది విజ‌య‌వంత‌మైతే గ‌నుక‌.. ఈ సీక్రెట్ బ్రాస్లెట్ మొబైల్ ఫోన్ ప‌ది రంగుల్లో మ‌న‌కు ల‌భిస్తుంది. అలాగే రెండు డ్రైవ్ పరిమాణాలలో16 మరియు 32 జిబిలలో లభించేలా ప్రణాళిక చేయబడింది. మ‌రియు ఈ ఫోన్‌ను స్నానం చేసేట‌ప్పుడు, డాన్స్ చేసేట‌ప్పుడు ఇలా ఎక్క‌డైనా ఎలాగైన ఉప‌యోగించుకోవ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: