రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీతో పాటు అనేక రకాల మొబైల్ ఫోన్లు విడుదల అవుతున్నాయి మార్కెట్లో. ఈ పోటీ ప్రపంచంలో రోజుకి ఒక్క మొబైల్
ఫోన్ సరి కొత్త ఫీచర్స్ లతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు వివిధ కంపెనీ వారు. ఈ దశలోనే రియల్మీ సంస్థ కూడా ఫ్లాగ్ షిప్ మొబైల్ ఫోను అతి త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.
రియల్ మీ సంస్థ తన మొట్టమొదటి ఫ్లాగ్ షిప్ మొబైల్ ఫోనుగా రియల్ మీ X 2 Pro ను ముందుగా చైనాలో లాంచ్ చేయడం జరిగింది.
ఇప్పుడు కంపెనీ, ఈ మొబైల్ ఫోన్ను
ఇండియా మార్కెట్లో లాంచ్ చేయడానికి నవంబరు 20 వ తేదికి సిద్ధంగా ఉన్నట్లు తెలియచేసింది. ఇది చైనాలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోనుగా లాంచ్ చేయబడినా కూడా ఇది కేవలం మిడ్-రేంజ్ విభాగంలో కంపెనీ విడుదల చేసిన మొట్టమొదటి మొబైల్ ఫోనుగా నిలవడం జరిగింది. ఈ ధర వద్ద, ఈ మొబైల్
ఫోన్ redmi K 20 Pro కు చాలా కఠినమైన పోటీని ఇచ్చే సామర్థ్యాన్ని ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది అని తెలుస్తుంది.
ఇంతకీ ఈ మొబైల్ ఫోను ప్రత్యేకతలు చూద్దామా మరి... ఈ మొబైల్ ఫోనులోఒక 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే తో రాబోతుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ కూడా ఫోనులో ఉండబోతుంది.
ఇక బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే 4000mAh సామర్థ్యం గల బ్యాటరీని 50W VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజితో ఉంది ఈ మొబైల్ ఫోను.
కెమెరా కూడా మంచి 64 MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటుగా ఒక 13MP టెలిఫోటో లెన్స్ తో లభిస్తుంది ఈ మొబైల్ ఫోన్. ఇన్ డిస్ప్లే వేలిముద్ర సెన్సార్ టెక్నలాజితో వస్తుంది.