మీ కెవైసి ని పూర్తి చేయమని తెలియజేసే పేటియం నుండి మీకు సందేశం వచ్చినట్లయితే, జాగ్రత్త! పేటియం సంస్థ పేరిట నకిలీ సందేశాలు ప్రసారం అవుతున్నాయని పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ ట్విట్టర్లో ప్రకటించారు.
మీ పేటీఎం ఖాతాను బ్లాక్ చేస్తున్నామని, కెవైసి ని వెంటనే అప్లోడ్ చేయమని సూచించే సందేశాలను నమ్మవద్దు. మీ ఖాతాలో డబ్బును కాజేసేందుకు కొందరు మోసగాళ్లు నకిలీ సందేశాలను పంపిస్తున్నారు అని విజయవాడ శేఖర్ వర్మ చెప్పారు. పేటీఎం పేరు మీద విస్తృతంగా కెవైసి స్కామ్ సందేశాలు పంపబడుతున్నాయి అని పేర్కొన్నారు కెవైసి పూర్తి చేసేందుకు ఏదైనా యాప్ ను డౌన్లోడ్ చేసుకోమని అడిగితే స్పందించొద్దు అని తెలిపారు.
పేటీఎం ఖాతాకు సంబంధించిన కేవైసీ వివరాలకోసం ఏదైనా మెసేజ్ వచ్చిందా..అయితే అలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండమని ఆయన హెచ్చరించారు. పేటీఎం అలాంటి వివరాలను వినియోగదారులను కోరడం లేదని, అలాగే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోమని తాము సూచించమని వినియోగదారులకు స్పష్టం చేశారు. అలాంటి సందేశాలను, కాల్స్‌ను నమ్మవద్దని కోరారు. అలాగే భారీ బహుమతి, లక్కీ చాన్స్ అంటూ వచ్చే మెసేజ్‌ల మాయలో పడొద్దని కూడా ఆయన సూచించారు. మీ వివరాలను హ్యాక్ చేయడానికి మెసగాళ్లు చేసే పని ఇదని వారి వలలో పడకండి ఆయన హెచ్చరించారు. ఇదో కుంభకోణమని పేర్కొన్న ఆయన దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
నివేదికల ప్రకారం, స్కామ్స్టర్లు కెవైసి వివరాలను పూర్తి చేయడానికి ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సింది గా కోరుతారు. ఈ యాప్ లో పిన్ ఎంటర్ చేయగానే స్కామ్స్టర్లు తమ పరికరం తో హాక్ చేసి మొబైల్ వాలెట్‌తో అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు దోచేస్తారు. కాబట్టి పేటియం వాడే వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.