ఎయిర్ టెల్, జియో సంస్థలు తమ కస్టమర్ల కోసం వోవైఫై కాలింగ్ సపోర్ట్ ను అందుబాటులోకి తెచ్చాయి. వోవైఫై కాలింగ్ సపోర్ట్ అంతర్జాతీయంగా ఎప్పటినుండో అందుబాటులో ఉంది. కానీ భారత్ లో మాత్రం చాలా సంవత్సరాల తరువాత వోవైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వోవైఫై సదుపాయం ద్వారా కస్టమర్లు చాలా ప్రయోజనాలను పొందవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో మాత్రమే వోవైఫైని ఉపయోగించుకోవచ్చు. 
 
వోవైఫై అనగా వాయిస్ ఓవర్ వైఫై కాలింగ్. ఈ సదుపాయం ద్వారా ముఖ్యంగా వైఫై కనెక్షన్ ను ఉపయోగించి వాయిస్ కాల్స్ ను చేసుకోవచ్చు. చాలా తక్కువ సిగ్నల్ పాయింట్లు చూపిస్తున్నా, సిగ్నల్ లేకపోయినా వోవైఫై సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ టెల్, జియో నెట్ వర్క్ లలో ఇండియాలో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లలో, లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. 
 
వోవైఫైని ఉపయోగించాలంటే ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఆండ్రాయిడ్ ఫోన్లలో సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్ వర్క్ సెట్టింగ్స్ లో ఈ ఆప్షన్ ఉంటుంది. ఐ ఫోన్ లో మొబైల్ డేటా క్లిక్ చేసిన తరువాత వైఫై కాలింగ్ ను ఆన్ చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లలో ఒకసారి వోవైఫై కాలింగ్ ను ఆన్ చేస్తే ఆ తరువాత ఫోన్లలో సిగ్నల్ లేకపోయినా, నెట్ వర్క్ సరిగా లేకపోయినా ఆటోమేటిక్ గా వోవైఫై కాలింగ్ ఆన్ అవుతుంది. వోవైఫై కాల్ సిగ్నల్ తక్కువగా ఉందో లేదో చెక్ చేసుకొని ఆ తరువాత మాత్రమే కనెక్ట్ అవుతుంది. వోవైఫై ద్వారా నెట్ వర్క్ లేకున్నా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే కాల్స్ సులభంగా చేసుకోవచ్చు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: