టెలికాం కంపెనీలు వినియోగదారులకు భారీ షాక్ ఇవ్వబోతున్నాయి. ఇప్పటివరకు చౌక ధరలకే కాల్స్, ఇంటర్నెట్ పొందిన వినియోగదారులకు కంపెనీలు 50 శాతం వరకు ఛార్జీలను పెంచబోతున్నాయి. భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రేపటి నుండి కాల్, డేటా ఛార్జీలను పెంచబోతున్నట్లు ప్రకటన చేశాయి. ఈరోజు అర్ధరాత్రి నుండి పెంచిన ఛార్జీలు అమలులోకి వస్తాయి. 
 
భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ సంస్థలు జియో బాటలో ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే నిమిషానికి ఆరు పైసల చొప్పున వసూలు చేయనున్నాయి. ఇన్ కమింగ్ కాల్స్ రావాలన్నా నెలకు కనీసం 49 రూపాయలు రీఛార్జి చేయించుకోవాల్సి ఉంటుంది. జియో ఈ నెల 6వ తేదీ నుండి ఛార్జీలను పెంచబోతుంది. 40 శాతం వరకు ఛార్జీలను పెంచుతున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. నష్టాలు భారీగా పెరగటంతో నష్టాలను తగ్గించుకోవటం కొరకు ఛార్జీలను పెంచాలని టెలికాం కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
దాదాపు ఐదు సంవత్సరాల తరువాత టెలికాం కంపెనీలు ఛార్జీలను పెంచాయి. రేపటి నుండి పాత ప్లాన్ల స్థానంలో కొత్త ప్లాన్లు అమల్లోకి వస్తాయి. వొడాఫోన్ ఐడియాలో రోజుకు 1.5 జీబీతో 28 రోజుల కాల పరిమితి ఉన్న ప్లాన్ 199 రూపాయల నుండి 249 రూపాయలకు పెరిగిందని సమాచారం. రోజుకు 1.5 జీబీతో 84 రోజుల కాలపరిమితి ఉన్న ప్లాన్ 458 రూపాయల నుండి 599 రూపాయలకు పెరిగిందని సమాచారం. 
 
ఎయిర్ టెల్ లో రోజుకు 1.5 జీబీతో 28 రోజుల కాల పరిమితి ఉన్న ప్లాన్ 199 రూపాయల నుండి 248 రూపాయలకు పెరిగిందని సమాచారం. రోజుకు 1.5 జీబీతో 84 రోజుల కాలపరిమితి ఉన్న ప్లాన్ 458 రూపాయల నుండి 598 రూపాయలకు పెరిగిందని సమాచారం. ఇతర నెట్ వర్క్ లకు మాట్లాడే కాల్స్ పై 28 రోజుల వాలిడిటీ ఉండే ప్లాన్లపై 1,000 నిమిషాలు, 84 రోజులు ఉండే ప్లాన్లపై 3,000 నిమిషాల కాల పరిమితి ఉండబోతుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: