ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారులకు వాట్సాప్ సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది. వాట్సాప్ ను 2020 సంవత్సరంలో పాత వెర్షన్ ఫోన్లలో నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ సంస్థ ప్రకటించింది. విండోస్ ఫోన్లలో డిసెంబర్ 31వ తేదీ తరువాత వాట్సాప్ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయని సమాచారం. పాత వెర్షన్ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్న వారు ఫిబ్రవరి 1వ తేదీ తరువాత వాట్సాప్ యాప్ ను ఉపయోగించడం వీలు కాదు. 
 
2020 ఫిబ్రవరి నెల 1వ తేదీ తరువాత యాపిల్ ఫోన్లలో ఐఏఎస్8 లేదా అంతకంటే పాత వెర్షన్ ఉపయోగించే మొబైల్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేయకపోయినా అన్ ఇన్ స్టాల్ చేయకపోయినా వాట్సాప్ యాప్ ఈ ఫోన్లలో ఉపయోగించవచ్చు. అప్ డేట్ చేసినా అన్ ఇన్ స్టాల్ చేసినా వాట్సాప్ యాప్ ఈ ఫోన్లలో పని చేయదు. 
 
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో 2.3.7 లేదా అంతకంటే పాత వెర్షన్ ఉపయోగించే ఫోన్లకు వాట్సాప్ నిలిచిపోనుందని సమాచారం. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగిస్తున్న వినియోగదారులకు డిసెంబర్ 31వ తేదీ తరువాత వాట్సాప్ పని చేయదు. వాట్సాప్ ను దాదాపు అన్ని విండోస్ ఫోన్లలో నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ యాజమాన్యం ప్రకటించింది. ఓఎస్ ఆధారంగా పని చేసే విండోస్ 10 ఆపరేటింగ్ ఫోన్లలో కూడా వాట్సాప్ యాప్ పని చేయదని తెలుస్తోంది. వాట్సాప్ తన వెబ్ సైట్ లో దీనికి సంబంధించిన వివరాలను పేర్కొంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: