డిజిటల్ లావాదేవీల కొరకు స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో గూగుల్ పే ఒకటి. దేశంలో కోట్ల సంఖ్యలో గూగుల్ పే ను వినియోగించే వారు ఉన్నారు. అందువలన ఈ మధ్య కాలంలో హ్యాకర్లు గూగుల్ పే కస్టమర్లను టార్గెట్ చేస్తున్నారు. చాలామంది నగదు ఒక బ్యాంక్ ఖాతా మరో ఖాతాకు బదిలీ చేయటానికి, ఫోన్ బిల్లులు, కరెంట్ బిల్లులు, ఇతర బిల్లులు చెల్లించటానికి గూగుల్ పే యాప్ ను వినియోగిస్తున్నారు. 
 
కానీ ఈ మధ్య కాలంలో గూగుల్ పే యాప్ ను అడ్డు పెట్టుకుని మోసాలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గూగుల్ పే కస్టమర్లకు గూగుల్ పే వినియోగదారులకు శుభవార్త అంటూ మొబైల్ ఫోన్లకు సందేశాలు వస్తున్నాయి. వచ్చిన మెసేజ్ లో ఒక లింక్ ఉంటుంది. పొరపాటున ఆ లింక్ ను క్లిక్ చేస్తే చాలు బ్యాంకు ఖాతాలలోని డబ్బులు మాయమవుతున్నాయి. 
 
కొందరు సైబర్ నేరగాళ్లు ఈ లింక్ క్లిక్ చేస్తే గూగుల్ పే స్క్రాచ్ కార్డులను పొందవచ్చు అంటూ గూగుల్ పే వినియోగదారులకు పంపిస్తున్నారు. గతంలో ఈ లింక్ లను క్లిక్ చేసిన చాలామంది ఖాతాలలో డబ్బులు పోయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సైబర్ నేరగాళ్లు గూగుల్ పే కు కేవైసీ చేసుకోవాలని లేకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని సందేశాలు పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా మెసేజ్ వచ్చిన లింక్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని కోరగా వివరాలను నమోదు చేసిన డాక్టర్ ఖాతాలోని 5 లక్షల రూపాయలు మాయమయ్యాయి. 
 
అందువలన గూగుల్ పే యాప్ వినియోగిస్తున్న వారు మన మొబైల్ ఫోన్ కు వచ్చే సందేశాలు నిజంగా కంపెనీల నుండే వచ్చాయా..? లేదా...? నిర్ధారణ చేసుకోవాలి. ఏవైనా సందేహాలు ఉంటే బ్యాంకు అధికారులకు సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవడం మంచిది. ఎట్టి పరిస్థితులలోను మన బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలను ఇతరులకు చెప్పడం, మోసగాళ్లు పంపిన లింక్ లపై క్లిక్ చేసి వివరాలను ఎంటర్ చేయడం చేయకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: