ఈ కాలం పిల్లలు అన్నింటిలోనూ ఫాస్టే.. కొత్త తరం కదా. అంటే అప్ డేటెడ్ వర్షన్ అన్నమాట. అందుకే అన్నీ త్వరగా నేర్చుకుంటారు. ఇందుకు తాజా ఉదాహరణ హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన సిద్దాంత్ నాయర్. ఈ బుడ్డోడి వయస్సు కేవలం ఏడేళ్లు. కానీ ఇప్పటికే ఓ యూప్ రూపొందించేశాడు. టిఫిప్లానర్ అప్లికేషన్‌ను రూపొందించి అందరినీ అబ్బురపరిచాడు.
ఈ యాప్ ఏం చేస్తుందంటే.. ఉదయాన్నే తీసుకునే పోషకాహారం ఎంపికను బట్టి అందులో ఎన్ని పోషకాలున్నాయో ఇది తెలుపుతుంది. ప్రోటీన్లు, విటమిన్లు, క్యాలరీలు, కాల్షియం పరిమాణాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఉరుకుల పరుగుల కాలంలో ఈ యాప్ చాలా ఉపయోగం అంటున్నారు.
మరి దీన్ని సిద్దాంత్ ఎలా తయారు చేశాడంటే.. ఇంటర్ నెట్ ద్వారా వైట్‌హ్యాట్ జూనియర్ ప్లాట్‌ఫామ్ వేదికగా సిద్ధాంత్ కోడింగ్ శిక్షణ తీసుకున్నాడు. 6-14 ఏళ్ల వయస్సున్న పిల్లలకు ఈ ప్లాట్ ఫామ్ కోడింగ్ లో శిక్షణ అందిస్తోంది.
కోడింగ్ లో ప్రాథమికాంశాలు, కోడింగ్ స్ట్రక్చర్, సీక్వెన్స్, అల్గారిథమ్ థింకింగ్ తదితర అంశాలను చిన్నారు లకు నేర్పించి ప్రాథమిక స్థాయిలో యానిమేషన్, యాప్ రూపొందించేలా ట్రైనింగ్ ఇస్తోంది. ఇందులో యాప్ తయారీ నేర్చుకుని మెంటార్ సాయంతో దాన్ని డెవలప్ చేశాడు.